ప్రతి రంగంలోనూ కొత్త వాళ్లు వచ్చే కొద్దీ పాత వాళ్లు వైదొలుగుతుంటారు. సినిమాల్లో అయినా, క్రీడల్లో అయినా.. ఎక్కడైనా ఇది సర్వసాధారణం. అయితే క్రికెట్లో కూడా ఎంతో కాలంగా ఆడుతున్న ఆటగాళ్లు కొన్నేళ్లకు ఆటకు గుడ్ బై చెబుతుంటారు. తాజాగా శ్రీలంక క్రికెట్ జట్టు ఆల్‌రౌండర్ తిసారా పెరీరా కూడా అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్ బై చెప్పాడు. సుదీర్ఘ కెరీర్ నుంచి శాశ్వత విరామం తీసుకోబోతున్నట్లు చెప్పాడు. ఈ మేరకు పెరీరానే స్వయంగా సోమవారం ఓ ప్రకటన విడుదల చేశాడు. ఈ విషయాన్ని శ్రీలంక క్రికెట్ బోర్డుకు కూడా తెలియజేశానని, తన రిటైర్మెంట్‌కు సంబంధించి లేఖ ద్వారా తెలియజేశానని అన్నాడు.
రిటైర్మెంట్ ప్రకటించిన తరువాత తిసారా పెరీరా మాట్లాడుతూ.. ‘శ్రీలంకకు నేను ప్రాతినిథ్యం వహించడాన్ని గొప్పగా భావిస్తున్నాను. ఓవరాల్‌గా 7 క్రికెట్ వరల్డ్‌కప్‌లో శ్రీలంక తరఫున ఆడాను. 2014లో టీ20 వరల్డ్‌కప్ గెలిచిన శ్రీలంక జట్టులో సభ్యుడిగా ఉన్నాను. ఇది నా జీవితంలో ఒక గొప్ప ఘనత’ అని ఎస్‌ఎల్‌సీకి రాసిన లేఖలో పేర్కొన్నాడు. పెరీరా తొలిసారి 2009లో టీమిండియాతో జరిగిన వన్డే మ్యాచ్‌తో జాతీయ జట్టులోకి అడుగుపెట్టాడు. అలాగే టీ20ల్లో 2010లో జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో తొలిసారిగా బరిలోకి దిగగా.. అన్నిటికంటే ఆలస్యంగా టెస్టుల్లో 2011లో ఇంగ్లండ్‌తో తొలి మ్యాచ్ ఆడాడు. కానీ టెస్టుల్లో పెరీరా అంతగా రాణించలేకపోయాడు. కెరీర్ మొత్తంలో 6 టెస్టులు మాత్రమే పెరీరా ఆడాడు.
అయితే పరిమిత ఓవర్ల క్రికెట్‌లో మాత్రం 166 వన్డేలు తిసారా 2,338 పరుగులు చేసి 75 వికెట్లు కూడా సాధించాడు. ఇక టీ20ల్లో 84 మ్యాచ్‌లు ఆడి 1204 పరుగులు చేసి 51 వికెట్లు పడగొట్టాడు. పెరీరా శ్రీలంకకు దక్కిన మేటి ఆల్ రౌండర్లలో ఒకడని చెప్పడం అతిశయోక్తి లేదు. ఈ క్రమంలోనే పెరీరా రిటైర్మెంట్‌పై శ్రీలంక అభిమానులు సోషల్ మీడియాలో స్పందిస్తున్నారు. రిటైర్మెంట్ తరువాత కూడా ఆనందంగా గడపాలని కోరుకుంటున్నామంటూ వేల మంది పోస్టులు పెడుతున్నారు.