క్రికెట్ చాలా రోజులుగా డీఆర్‌ఎస్(డెసిషన్ రివ్యూ సిస్టం) విషయంలో రచ్చ జరుగుతున్న విషయం తెలిసిందే. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీతో పాటు అనేకమంది మాజీలు కూడా డీఆర్‌ఎస్‌లోని అంపైర్స్ కాల్‌పై అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇది ఆటగాల్లను అయోమయానికి గురి చేస్తోందని వారంటున్నారు. తాజాగా ఇంగ్లండ్‌తో సిరీస్ ముగిసిన సందర్భంగా టీమిండియా కెప్టెన్ బహిరంగంగానే ఈ అంపైర్స్ కాల్ విధానాన్ని విమర్శించాడు. బంతి వికెట్లను తాకిందంటే అవుట్ ఇచ్చేయాలని, అంతేకానీ మధ్యలో ఈ అంపైర్స్ కాల్ ఏంటని మండిపడ్డాడు. ఈ క్రమంలోనే జరిగిన అంతర్జాతీయ క్రికెట్ మండలి కమిటీ సమావేవం జరగడం ప్రాధాన్యం సంతరించుకుంది.
బుధవారం అంతర్జాతీయ క్రికెట్ కౌన్నిల్ క్రికెట్ కమిటీ ప్రత్యేక సమావేశం జరిగింది. కమిటీ అధ్యక్షుడు అనీల్ కుంబ్లే ఈ సమావేశానికి అధ్యక్షత వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ సమావేశంలో డీఆర్‌లోని అంపైర్స్ కాల్ విషయంలో జరుగుతున్న చర్చ గురించి సుదీర్ఘంగా చర్చించామని కోహ్లీ తెలిపారు. అయితే మైదానంలో ఫీల్డ్ అంపైర్‌కు ఉండే విలువను కాపాడేందుకు అంపైర్స్ కాల్ చాలా అవసరమని, అందుకే దానిని తొలగించే అవకాశమే లేదని చెప్పారు. అయితే డీఆర్‌ఎస్ విషయంలో మూడు మార్పులను మాత్రం చేసినట్లు తెలిపారు. ‘డెసిషన్ రివ్యూ సిస్టంలో అంపైర్స్ కాల్‌ను తొలగించడం లేం. ఫీల్డ్ అంపైర్ స్థానానికి విలువ తగ్గకూడదనే ఈ నిర్ణయాన్ని తీసుకున్నాం’ అని అనిల్ కుంబ్లే వెల్లడించారు.
కాగా. డీఆర్‌ఎస్‌కు మూడు మార్పులు చేసినట్లు వెల్లడించారు. అందులో మొదటిది.. ఎల్‌బీడబ్ల్యూ విషయంలో వికెట్ల టాప్ మార్జిన్‌ను స్టంప్స్ కింది భాగం నుంచి పై భాగం వరకు పెంచినట్లు చెప్పారు. అంటే ఇక నుంచి కింది భాగమే కాకుండా పైభాగం వరకు లెక్కలోకి తీసుకోవడం జరుగుతుందని చెప్పారు. అలాగే ఎవరైనా ఆటగాడిని ఫీల్డ్ అంపైర్ అవుట్‌గా ప్రకటించిన తరువాత అతడు అంపైర్‌తో మాట్లాడి.. తాను బంతిని సక్రమంగా ఆడింది లేనిది తెలుసుకునేందుకు వీలుంటుందని తెలిపారు. దాంతో పాటు షార్ట్ రన్ విషయంలో కూడా థర్డ్ అంపైర్ ప్రతి క్షణం ఓ కన్నేసి ఉంటారని కుంబ్లే వెల్లడించారు.