Wednesday, January 22, 2025

దిల్ రాజు చేతుల మీదుగా ‘డ్రీమ్ బాయ్’ ఫస్ట్ లుక్, ట్రైలర్ విడుదల

సెవెన్ వండర్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై సాయితేజ, హరిణి రెడ్డి హీరోహీరోయిన్లుగా.. రాజేష్ కనపర్తి దర్శకత్వంలో రేణుక నరేంద్ర నిర్మించిన చిత్రం ‘డ్రీమ్ బాయ్’. ఈ చిత్ర ఫస్ట్ లుక్, ట్రైలర్‌ను సక్సెస్‌ఫుల్ చిత్రాల నిర్మాత దిల్ రాజు చేతుల మీదుగా చిత్రయూనిట్ విడుదల చేయించింది. ఫస్ట్ లుక్, ట్రైలర్ విడుదల అనంతరం నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ.. ఫస్ట్ లుక్, ట్రైలర్ చాలా బాగుంది. ప్రజంట్ ట్రెండ్‌కి ఈ తరహా చిత్రాలు బాగా నచ్చుతాయి. చిత్రయూనిట్‌కి నా అభినందనలు తెలియజేస్తున్నాను. సినిమా పెద్ద విజయం సాధించాలని కోరుతున్నాను.. అని తెలిపారు.

ఈ సందర్భంగా దర్శకుడు రాజేష్ కనపర్తి మాట్లాడుతూ.. ‘‘ఎంతో బిజీ షెడ్యూల్‌లో ఉండి కూడా మేము రిక్వెస్ట్ చేసిన వెంటనే సహృదయంతో స్పందించి మా చిత్ర ట్రైలర్, ఫస్ట్ లుక్ విడుదల చేసిన దిల్ రాజుగారు మరోసారి మనసున్న మారాజు అని చాటుకున్నందుకు ఆయనకు మా చిత్రయూనిట్ తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. దిల్ రాజుగారి ఆశీర్వాద బలంతోనూ, నిర్మాతగారి సంకల్ప బలంతోనూ ఈ సినిమా సక్సెస్ అవుతుందని నమ్ముతున్నాను. ఈ సినిమా పూర్తి కావటానికి సహకరించిన ఆర్టిస్టులకి, టెక్నీషియన్స్ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను..’’ అన్నారు.

నిర్మాత రేణుక నరేంద్ర మాట్లాడుతూ.. ‘‘ మా ‘డ్రీమ్ బాయ్’ చిత్ర ఫస్ట్ లుక్, ట్రైలర్ విడుదల చేసిన దిల్ రాజు గారికి కృతజ్ఞతలు. ట్రైలర్ చూసి ఆయన ఈ సినిమా మంచి సక్సెస్ అవుతుందని చెప్పడంతో మాకెంతో ధైర్యం వచ్చింది. సినిమా చాలా బాగా వచ్చింది. దర్శకుడు రాజేష్ కనపర్తి.. ఈ సినిమాని నేటి ట్రెండ్‌కి అనుగుణంగా మలిచాడు. త్వరలోనే విడుదల తేదీని ప్రకటిస్తాం..’’ అన్నారు.

Dil Raju Launches Dream Boy Movie Trailer and First Look
Dil Raju Launches Dream Boy Movie Trailer and First Look

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ వై.కె. నరేంద్ర మాట్లాడుతూ.. ‘‘నిర్మాత దిల్ రాజుగారు.. జడ్జిమెంట్ ఎలా ఉంటుందో తెలియంది కాదు. ఆయన మా డ్రీమ్ బాయ్ చిత్ర ట్రైలర్ చూసి.. మంచి ఫీడ్ బ్యాక్ ఇచ్చారు. ఆయన ఇచ్చిన ధైర్యంతో మేమంతా చాలా హ్యాపీగా, కాన్ఫిడెంట్‌గా ఉన్నాం. ఈ సందర్భంగా ఆయనకి ధన్యవాదాలు. త్వరలోనే చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నాం..’’ అని తెలిపారు.

సాయితేజ, హరిణి రెడ్డి, ధనరాజ్, చమ్మక్ చంద్ర, రాకింగ్ రాజేష్, సూర్య, హేమ, వాసు ఇంటూరి, సుఖేష్ రెడ్డి, లడ్డు.. తదితరులు నటించిన ఈ చిత్రానికి
కెమెరా: నాని, సుభాష్ దొంతి, శ్రీనివాస్ కొంగ
ఎడిటర్: భస్వా పైడిరెడ్డి
ఫైట్స్: క్రాంతి
కొరియోగ్రాఫర్స్: చిరంజీవి, పైడిరాజు
లిరిక్స్: శ్రీరామ్ తపస్వి
రచనా సహకారం: ఘంటా శ్రీనివాస్, సాంబ చిలంకూరి
కో-డైరెక్టర్: కె. రాధాకృష్ణ
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: వై.కె. నరేంద్ర
పి.ఆర్.ఓ: బి.ఎస్. వీరబాబు
నిర్మాత: రేణుక నరేంద్ర
కథ, కథనం, మాటలు, దర్శకత్వం: రాజేష్ కనపర్తి

5 2 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments

Related Articles

Social Share

3,894FansLike
3,576FollowersFollow
3,976FollowersFollow
2,480FollowersFollow
1,267FollowersFollow
7,784SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -
0
Would love your thoughts, please comment.x
()
x