Friday, November 1, 2024

కోహ్లీ-బట్లర్ మధ్య వివాదం గురించి నోరు విప్పిన ఇంగ్లీష్ కెప్టెన్

ఇంగ్లండ్‌తో జరిగిన 5వ టీ20లో రోహిత్-కోహ్లీ అదిరిపోయే ఓపెనింగ్ పార్ట్‌నర్‌షిప్ ఎంతగా గుర్తుండిపోతుందో.. కోహ్లీ-బట్లర్ మధ్య వివాదం కూడా అంతే గుర్తుండిపోయింది. టీమిండియా ఇచ్చిన 224 పరుగుల భారీ టార్గెట్‌తో బరిలోకి దిగిన ఇంగ్లండ్ తొలి బంతి నుంచే ధాటిగా ఆడింది. ఓపెనర్లు జేసన్ రాయ్, జోస్ బట్లర్ బౌండరీలతో చెలరేగారు. దీంతో వికెట్ కోల్పోకుండా విజయం వైపు దూసుకుపోయింది. అయితే 13వ ఓవర్లో భువీ బౌలింగ్‌లో మిడ్ వికెట్ మీదుగా భారీ షాట్ ఆడబోయిన బట్లర్.. అక్కడ హార్దిక్ చేతికి చిక్కాడు. దీంతో టీమిండియా సంబరాల్లో మునిగిపోయింది. ఈ క్రమంలోనే పెవిలియన్‌కు వెళ్లే సమయంలో బట్లర్.. కోహ్లీ వైపు తిరిగి ఏదో అన్నాడు. దీంతో కోహ్లీకి కూడా చిర్రెత్తుకొచ్చింది. వెంటనే బట్లర్‌కు దీటుగా సమాధానమిచ్చాడు. అతడి వైపు దూసుకెళ్తూ కౌంటర్ అటాక్ చేశాడు. దీంతో బట్లర్ కూడా వెనక్కితిరిగి ఏదో అన్నాడు. దానికి కోహ్లీ కూడా అదే స్థాయిలో రిప్లై ఇచ్చాడు. ఇంతలో అంపైర్ వచ్చి కోహ్లీని నిలువరించాడు. బట్లర్‌ను వెళ్లిపోవాలని సూచించాడు. దీంతో వివాదం సర్దుమణిగింది. వెనక్కి వచ్చిన కోహ్లీ.. ఆ వివాదంపై అంపైర్‌కు వివరించాడు. దీనికి సంబంధించిన వీడియో కూడా కొద్ది రోజుల క్రితం సోషల్ మీడియాలో తెగ వైరలైంది.

దీనిపై ఎట్టకేలకు ఇంగ్లీష్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ నోరు విప్పాడు. కోహ్లీ మైదానంలో చాలా ఎగ్రెసివ్‌గా ఉంటాడనే విషయం అందరికీ తెలుసని, ఇక అతడు ఫాంలో ఉన్నప్పుడు అతడి ఉద్రేకస్థాయి మరింత ఎక్కువగా ఉంటుందని అన్నాడు. ప్రతి ఫీలింగ్‌నూ అత్యధికంగా చూపిస్తాడని, అందుకే ఇలాంటి వాగ్వాదాల్లో అతడే ముదుంటాడని చెప్పుకొచ్చాడు. అందులో భాగంగానే కోహ్లీ, బట్లర్ మధ్య చిన్న వివాదం రేగిందని, అయితే ఆ మాటల యుద్ధాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదని, అలాంటి హై టెన్షన్ మ్యాచ్‌లలో అదంతా సహజమేనని అన్నాడు.

ఇదిలా ఉంటే ఇంగ్లండ్‌తో జరిగిన 5 టీ20ల సిరీస్‌ను భారత్ 3-2తో కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే తొలి నాలుగు మ్యాచ్‌లలో చెరో రెండు విజయాలతో ఇరు జట్లూ సరిసమానంగా ఉన్నా.. చివరి మ్యాచ్ మాత్రం భారత్ పూర్తి స్థాయి ఆధిపత్యం చెలాయించింది. దీంతో టీమిండియా ఘన విజయం సాధించడమే కాక సిరీస్ కూడా కైవసం చేసుకుంది. అలాగే వన్డే సిరీస్‌లో భాగంగా మంగళవారం ఇంగ్లండ్‌తో జరిగిన తొలి వన్డేలోనూ 66 పరుగుల తేడాతో విజయం సాధించింది.

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments

Related Articles

Social Share

3,894FansLike
3,576FollowersFollow
3,976FollowersFollow
2,480FollowersFollow
1,267FollowersFollow
7,784SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -
0
Would love your thoughts, please comment.x
()
x