Friday, November 1, 2024

హీరో శ్రీకాంత్‌కి బర్త్‌డే విశెస్ తెలిపిన ‘తెలంగాణ దేవుడు’ చిత్రయూనిట్

మార్చి 23.. ఫ్రెండ్లీ హీరో శ్రీకాంత్ పుట్టినరోజు. ఈ సందర్భంగా శ్రీకాంత్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు ‘తెలంగాణ దేవుడు’ చిత్ర టీమ్. ఉదయాన్నే శ్రీకాంత్ ఇంటికి వెళ్లిన చిత్ర దర్శకనిర్మాతలు పుష్ఫ గుచ్ఛంతో పాటు స్వీట్ బాక్స్‌ని ఆయనకు అందచేసి.. ఇలాంటి పుట్టినరోజు వేడుకలు ఆయన మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు. హీరో శ్రీకాంత్ కూడా సంతోషం వ్యక్తం చేసి.. వారికి ధన్యవాదాలు తెలిపారు. 1969 నుంచి 2014 వరకు తెలంగాణ ప్రాంతంలో జరిగిన పరిస్థితులను చూసి ప్రజల కష్టాలను తీర్చిన ఒక ఉద్యమ ధీరుడి జీవిత చరిత్ర కథాంశంతో దర్శకుడు వడత్యా హరీష్ ‘తెలంగాణ దేవుడు’ చిత్రాన్ని రూపొందిస్తున్న విషయం తెలిసిందే. మ్యాక్స్ ల్యాబ్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై మహ్మద్‌ జాకీర్ ఉస్మాన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. హీరో శ్రీకాంత్ టైటిల్‌ రోల్ చేస్తున్న ఈ చిత్రంతో నిర్మాత మహ్మద్ జాకీర్ ఉస్మాన్ తనయుడైన జిషాన్ ఉస్మాన్ వెండితెరకు నటుడిగా పరిచయం అవుతున్నారు. శ్రీకాంత్ సరసన సంగీత నటిస్తోన్న ఈ చిత్రంలో జిషాన్ ఉస్మాన్(తొలి పరిచయం), బ్రహ్మానందం, సునీల్, సుమన్, బ్రహ్మాజీ, మధుమితతో పాటు సుమారు 50 మంది అగ్ర తారాగణం నటిస్తున్నారు.

ఈ సందర్భంగా చిత్ర నిర్మాత మహ్మద్‌ జాకీర్ ఉస్మాన్ మాట్లాడుతూ.. ‘‘మా ‘తెలంగాణ దేవుడు’ హీరో శ్రీకాంత్‌గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఆయన ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని.. మా టీమ్ అంతా కోరుకుంటున్నాము. తెలంగాణ దేవుడు చిత్రం కోసం ఆయన ఇచ్చిన సహకారం మరువలేనిది. అంత సహృదయడు కాబట్టే అందరూ ఆయనని ఫ్రెండ్లీ స్టార్ అని పిలుచుకుంటారు. చిత్ర విషయానికి వస్తే.. తెలంగాణ ప్రాంతాలలో తెలంగాణ కోసం ఉద్యమం చేసి సాధించుకున్న తర్వాత ఏర్పడిన పరిణామాల గురించి ప్రస్పుటంగా ఈ చిత్రం ద్వారా తెలియజేయడం జరిగింది. దర్శకుడు వడత్యా హరీష్ చిత్రాన్ని చాలా చక్కగా తెరకెక్కించారు. ప్రస్తుతం చిత్రానికి సంబంధించి డిటిఎస్ మిక్సింగ్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలోనే చిత్ర విడుదల తేదీని ప్రకటిస్తాం..’’ అని తెలిపారు.

శ్రీకాంత్, సంగీత, జిషాన్ ఉస్మాన్ (తొలి పరిచయం), బ్రహ్మానందం, సునీల్, సుమన్, బ్రహ్మాజీ, వెంకట్, పృద్వి, రఘు బాబు, షాయాజి షిండే, విజయ్ రంగరాజు, బెనర్జీ, చిట్టిబాబు, మధుమిత, సత్య కృష్ణ, సన, రజిత, ఈటీవీ ప్రభాకర్, సమీర్, బస్ స్టాప్ కోటేశ్వరరావు, కాశీ విశ్వనాథ్, జెమిని సురేష్ తదితరులు నటించిన ఈ చిత్రానికి సాంకేతిక నిపుణులు
నిర్మాత: మహ్మద్‌ జాకీర్ ఉస్మాన్
రచన, దర్శకత్వం: వడత్యా హరీష్
మ్యూజిక్: నందన్ బొబ్బిలి
సినిమాటోగ్రాఫర్: అడుసుమిల్లి విజయ్ కుమార్
ఎడిటర్: గౌతంరాజు
లైన్ ప్రొడ్యూసర్: మహ్మద్‌ ఖాన్
మాక్స్‌ల్యాబ్ సిఈఓ: మహ్మద్‌ ఇంతెహాజ్‌ అహ్మద్‌

4.5 2 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments

Related Articles

Social Share

3,894FansLike
3,576FollowersFollow
3,976FollowersFollow
2,480FollowersFollow
1,267FollowersFollow
7,784SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -
0
Would love your thoughts, please comment.x
()
x