Sunday, March 22, 2026

‘నిన్నే పెళ్లాడతా’లోని పాట విడుదల చేసిన శ్రీకాంత్

ఈశ్వరీ ఆర్ట్స్, అంబికా ఆర్ట్స్ పతాకాలపై వైకుంఠ బోను దర్శకత్వంలో వెలుగోడు శ్రీధర్ బాబు, బొల్లినేని రాజశేఖర్ సంయుక్తంగా నిర్మిస్తోన్న చిత్రం ‘నిన్నే పెళ్లాడతా’. గతంలో కింగ్ నాగార్జున నటించిన ఇదే టైటిల్‌తో వచ్చిన చిత్రం సంచలన విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. ఇప్పుడు స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్ ఈ చిత్రంలో హీరోగా నటిస్తున్నారు. ‘పైసా’ మూవీ ఫేమ్ సిద్ధికా శర్మ హీరోయిన్. తాజాగా ఈ చిత్రంలోని సాంగ్‌ని హీరో శ్రీకాంత్ విడుదల చేసి.. చిత్రయూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు. అక్టోబర్ 14న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.

పాట విడుదల అనంతరం శ్రీకాంత్ మాట్లాడుతూ.. ‘‘ముందుగా హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్‌కు స్వాగతం పలుకుతున్నాను. పాట చాలా బాగుంది. డ్యాన్స్ కూడా చాలా బాగా చేస్తున్నాడు. హీరోహీరోయిన్లకే కాకుండా.. ఈ సినిమాలో నటించిన ప్రతి ఒక్కరికీ ఈ చిత్రం మంచి గుర్తింపును ఇవ్వాలని.. దర్శకనిర్మాతలకు ఈ చిత్రంతో మంచి సక్సెస్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్ టు టీమ్’’ అని అన్నారు.

చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ.. ‘‘హీరో శ్రీకాంత్‌గారు మా సినిమాలోని పాట విడుదల చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. వారికి మా టీమ్ తరపున ధన్యవాదాలు. ‘నిన్నే పెళ్లాడతా’ అనే టైటిల్ వినగానే గుర్తొచ్చే పేరు కింగ్ నాగార్జునగారు. ఆయన ఇప్పటికే మాకు ఆశీస్సులు అందించారు. చిత్ర ఫస్ట్ లుక్ ఆయన చేతులు మీదుగా విడుదలవడం మాకెంతో బూస్ట్‌నిచ్చింది. ఇక ఈ సినిమాని దర్శకుడు వైకుంఠ బోను తెరకెక్కించిన తీరు ప్రతి ఒక్కరినీ అలరిస్తుంది. అన్ని వర్గాల ప్రేక్షకులకు కావాల్సిన ఎలిమెంట్స్ ఈ చిత్రంలో ఉన్నాయి. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. అక్టోబర్ 14న గ్రాండ్‌గా చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాము..’’ అని తెలిపారు.

అమన్ (రకుల్ ప్రీత్ సింగ్ బ్రదర్), సిద్ధికా శర్మ (‘పైసా’ మూవీ ఫేమ్) డైలాగ్ కింగ్ సాయికుమార్, ఇంద్రజ, సీత, సిజ్జు, అన్నపూర్ణమ్మ, విద్యుల్లేఖ రామన్, మధు నందన్, గగన్ విహారి తదితరులు నటించిన ఈ చిత్రానికి

సంగీతం: నవనీత్
కెమెరా: ప్రసాద్ ఈదర, సురేష్ గొంట్ల
లిరిక్స్: భాస్కరభట్ల, చైతన్య ప్రసాద్, రాంబాబు గోసాల
ఎడిటర్: అనకాల లోకేష్
పీఆర్వో: బి. వీరబాబు
నిర్మాతలు: బొల్లినేని రాజశేఖర్ చౌదరి, వెలుగోడు శ్రీధర్ బాబు
కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: వైకుంఠ బోను

Related Articles

Social Share

3,894FansLike
3,576FollowersFollow
3,976FollowersFollow
2,480FollowersFollow
1,267FollowersFollow
7,784SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -