Wednesday, January 22, 2025

శార్దూల్ సిక్స్ చూసి స్టన్ అయిన స్టోక్స్ .. బ్యాట్ చెక్ చేసి మరీ..

తన బౌలింగ్‌లో భారీ సిక్స్ బాదిన టీమిండియా బౌలర్ శార్దూల్ ఠాకూర్ బ్యాట్‌ను ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ వెంటనే తీసుకుని చెక్ చేశాడు. 45వ ఓవర్ వేస్తున్న సమయంలో స్టోక్స్ వేసిన ఓ ఫుల్ లెంగ్త్ డెలివరీని శార్దూల్ ఠాకూర్ నేరుగా స్టాండ్స్‌లోకి పంపాడు. దీంతో స్టోక్స్ నవ్వుతూ శార్దూల్ బ్యాట్ తీసుకున్నాడు. శార్దూల్ కూడా నవ్వుతూనే తన బ్యాట్‌ను అతడికిచ్చాడు. బ్యాట్ తీసుకున్న స్టోక్స్ దానిని చెక్ చేశాడు. అయితే ఈ మధ్య కాలంలో జరిగిన పరిమిత ఓవర్ల క్రికెట్లో టీమిండియా క్రికెటర్లకు ఇంగ్లండ్ క్రికెటర్లకు మధ్య చాలాసార్లు వివాదాలు నెలకొన్నాయి. చివరి టీ20లో కోహ్లీ-బట్లర్, తొలి వన్డేలో కృనాల్-శామ్ కర్రాన్, రెండో వన్డేలో హార్దిక్-టామ్ కర్రాన్ మధ్య వివాదాలు జరిగాయి. ఈ నేపథ్యంలో స్టోక్స్-శార్దూల్ మధ్య ఇలాంటి ఫన్నీ మూమెంట్ చోటు చేసుకోవడం అభిమానులకు ఆనందాన్నిచ్చింది.

ఇదిలా ఉంటే ఈ మ్యాచ్‌లో శార్దూల్ మొత్తం 3 సిక్సులు కొట్టాడు. అలాగే వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ 4 సిక్స్‌లు బాదాడు. హార్దిక్‌లు 4 సిక్స్‌లు కొట్టారు. మొత్తం టీమిండియా 11 సిక్సులు బాదింది. కాగా, స్టోక్స్ బౌలింగ్‌లో శార్దూల్‌ కొట్టిన ఈ సిక్స్‌ మాత్రం అతడి బ్యాటింగ్‌లో హైలైట్‌‌గా నిలిచింది. స్టోక్స్ వేసిన 45 ఓవర్‌ నాలుగో బంతికి శార్దూల్‌ ఈ సిక్స్ కొట్టాడు. అఫ్‌ స్టంప్‌ ఆవలగా స్టోక్స్ వేసిన ఈ బంతిని శార్దూల్‌ ముందుకు దూకి మరీ సిక్స్‌ బాదడం హైలెట్‌గా నిలిచింది. దీనికి స్టోక్స్‌ సైతం ఆశ్చర్యపోయాడు. తాను వేసిన బంతిని సిక్స్ ఎలా కొట్టాడో అర్థం కాక అతడి బ్యాట్ తీసుకుని మరీ చెక్ చేశాడు. అలాగే ఆ సిక్స్ ఎలా కొట్టావని అతడిని ప్రశ్నించాడు.

ఇదిలా ఉంటే ఇంగ్లండ్‌తో మూడో వన్డేలో రోహిత్‌ శర్మ(37), ధవన్‌(67), పంత్‌(78), హార్దిక్‌ పాండ్యా(64)ల ఆట ఒక ఎత్తైతే, శార్దూల్‌ ఠాకూర్‌ ఇన్నింగ్స్‌ మరొక ఎత్తు. టీమిండియా కీలక వికెట్లు కోల్పోయి మూడొందల పరుగుల మార్కును దాటుతుందా అనుకునే సమయంలో శార్దూల్‌ ఠాకూర్ క్రీజులో ఉన్నంతసేపూ బౌండరీలతో మెరుపులు మెరిపించాడు. అది కూడా బంతులు వృథా చేయకుండా బ్యాట్‌కు పని చెప్పాడు. 21 బంతులు ఆడిన శార్దూల్‌ 1 ఫోర్‌, 3 సిక్సర్లతో 30 పరుగులు సాధించాడు. అయితే శార్దూల్ అవుటైన తరువాత మిగతా టెయిలెండర్లంతా వరుస బంతుల్లో అవుట్ కావడంతో 48.2 ఓవర్లలోనే 329 పరుగులు చేసి టీమిండియా ఆలౌటైంది.


330 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ జట్టు.. తొలి ఓవర్లోనే భువనేశ్వర్ బౌలింగ్‌లో జేసన్ రాయ్(14) వికెట్ కోల్పోయింది. అలాగే తొలి రెండు వన్డేల్లో అద్భుతంగా బ్యాటింగ్ చేసిన జానీ బెయిర్ స్టో ఈ మ్యాచ్‌లో కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు. దీంతో ఓపెనర్లను కోల్పోయి కష్టాల్లో పడిన ఇంగ్లండ్‌ను అరంగేట్ర ఆటగాడు డేవిడ్ మలాన్(50), ఇన్నింగ్స్‌ను కాపాడాడు. కాగా.. రెండో వన్డేలో మెరుపు ఇన్నింగ్స్ ఆడిన బెన్ స్టోక్స్(35) ఈ మ్యాచ్‌లో మాత్రం అంతగా రాణించలేదు. స్టోక్స్ వికెట్‌ను నటరాజన్ తీయగా.. మలాన్ వికెట్ ఠాకూర్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఆ తర్వాత కెప్టెన్ జోస్ బట్లర్(15), లియామ్ లివింగ్‌స్టన్(36), మొయీన్ అలీ(29), ఆదిల్ రషీద్(19), మార్క్ ఉడ్(14), దారుణంగా విఫలమయ్యారు. కానీ 8వ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన శామ్ కర్రాన్(95 నాటౌట్) టీమిండియాకు చుక్కలు చూపించాడు. విజయాన్ని టీమిండియా నుంచి లాక్కున్నంత పనిచేశాడు. అయితే నటరాజన్ అద్భుత బౌలింగ్‌తో మ్యాచ్‌ ఇండియా చేజిక్కించుకుంది. ఈ విజయంతో ఇంగ్లండ్‌పై టెస్ట్, టీ20, వన్డే సిరీస్‌లు మూడింటినీ టీమిండియా గెలుచుకున్నట్లైంది. ఇక ఇంగ్లండ్ వట్టిచేతులతోనే స్వదేశం బయలుదేరింది.

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments

Related Articles

Social Share

3,894FansLike
3,576FollowersFollow
3,976FollowersFollow
2,480FollowersFollow
1,267FollowersFollow
7,784SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -
0
Would love your thoughts, please comment.x
()
x