సాధారణంగా విరాట్ కోహ్లీని టాస్ విషయంలో దురదృష్టం వెంటాడుతూ ఉంటుంది. అత్యధిక మ్యాచ్‌లలో విరాట్ టాస్ ఓడిపోతూనే ఉంటాడు. తాజాగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న సిరీస్‌లోనూ ఇది కొనసాగుతూనే ఉంది. మొత్తంగా నాలుగు టెస్ట్‌లు, ఐదు టీ20లు, 3 వన్డేలతో కలిపి 12 మ్యాచ్‌లలో టాస్ వేయగా.. విరాట్ కేవలం 2 సార్లు మాత్రమే నెగ్గాడు. మిగిలిన 10 సందర్భాల్లో ఓడిపోయాడు. ఇప్పటివరకు క్రికెట్లో ఎన్నో గొప్ప రికార్డులు సాధించిన విరాట్ టాస్ ఓడడంలోనూ తనపేరునే రికార్డు రాసుకున్నాడు. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో జరిగిన ఆఖరి వన్డేలో వరుసగా మూడోసారి కోహ్లీ టాస్ ఓడాడు. దీంతో మళ్లీ ఇంగ్లండ్ ఫీల్డింగ్ ఎంచుకోవడంతో టీమిండియా బ్యాటింగ్ చేయాల్సి వచ్చింది.
మొదట జరిగిన టెస్ట్ సిరీస్‌లో భాగంగా చెన్నై వేదికగా జరిగిన రెండో టెస్టులో మొదటి సారి కోహ్లీ టాస్ గెలిచాడు. ఆ తర్వాత అన్ని మ్యాచ్‌లలో టాస్ ఓడిపోతూనే ఉన్నాడు. ఇక మళ్లీ టీ20 సిరీస్‌లో భాగంగా అహ్మదాబాద్ వేదికగా జరిగిన రెండో టీ20లో కోహ్లీ మళ్లీ టాస్ గెలిచాడు. ఆ తర్వాత మిగిలిన మూడు టీ20ల్లో ఓడిపోయాడు. ఇక తాజాగా జరుగుతున్న మూడు వన్డేల సిరీస్‌లో ఒక్కసారి కూడా కోహ్లీని టాస్ వరించలేదు. వరుసగా మూడుసార్లు కూడా ఇంగ్లీష్ కెప్టెన్‌లే టాస్ గెలిచారు.
ఈ నేపథ్యంలో టాస్ ఓడిపోవడంపై టీమిండియా కెప్టెన్ కూడా స్పందించాడు. ‘టాస్ గెలవడం మన చేతుల్లో ఉండదు. ప్రస్తుత సిరీస్‌లో చాలాసార్లు బౌలింగ్ తీసుకుందామని భావించాం. కానీ కుదరలేదు. అయితే టాస్‌లు గెలవకపోయినా మ్యాచ్‌లు గెలిచి సిరీస్‌లు కైవసం చేసుకోవడమే ముఖ్యం. అందుకే టాస్ గురించి అంతగా పట్టించుకోను’ అని కోహ్లీ చెప్పుకొచ్చాడు.
టాస్ విషయంలో కోహ్లీని వెంటాడుతున్న దురదృష్టంపై నెటిజన్లు ఫన్నీ సెటైర్లు వేస్తున్నారు. ‘దరిద్రం అంటే నీదే భాయ్.. దరిద్రం అదృష్టం పట్టినట్లు నిన్ను వెంటాడుతోంది’ అని ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. కాగా.. టాస్ విషయంలో కోహ్లీ కెప్టెన్సీలో టీమిండియా అత్యధికసార్లు ఓడిపోయింది.