Friday, November 1, 2024

పడిపోయిన కోహ్లీ, రాహుల్.. అగ్రస్థానానికి కివీస్ బ్యాట్స్‌మన్

అంతర్జాతీయ క్రికెట్ మండలి బుధవారం టీ20 ర్యాంకింగ్స్‌ ప్రకటించింది. ఈ ర్యాకింగ్స్‌లో టీమిండియా ఆటగాళ్లు దిగజారారు. ఏ ఒక్క విభాగంలోనూ భారత ఆటగాళ్లు టాప్ 3ని చేరుకోలేదు. కేవలం జట్టు విభాగంలో టాప్‌లో నిలిచారు. టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ ఒక స్థానం దిగజారి 762 పాయింట్లతో 5వ స్థానంలోకి చేరగా.. కేఎల్‌ రాహుల్‌ కూడా ఒక స్థానం దిగజారి 743 పాయింట్లతో ఆరో స్థానంలో ఉన్నాడు. కాగా.. న్యూజిలాండ్ ఆటగాడు డెవోన్‌ కాన్వే విరాట్‌ను దాటేశాడు. బంగ్లాదేశ్‌ మధ్య జరిగిన మొదటి టీ20లో 52 బంతుల్లోనే 92 పరుగులతో విధ్వంసం సృష్టించిన కాన్వే ఏకంగా ఐసీసీ ర్యాంకింగ్స్‌లో 5 స్థానాలు ఎగబాకి 784 పాయింట్లతో 4వ స్థానానికి చేరాడు. ఇదే అతడి కెరీర్ బెస్ట్. ఇక ఇంగ్లండ్‌ ఆటగాడు డేవిడ్‌ మలాన్‌ 892 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఆపై వరుసగా ఆరోన్‌ ఫించ్‌(830 పాయింట్లు), బాబర్‌ అజమ్‌( 801 పాయింట్లు) రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు.

ఇదిలా ఉంటే భారత బౌలర్లు మరింత దారుణంగా కనీసం టాప్‌ టెన్‌లో ఒక్కరు కూడా నిలవలేకపోయారు. బౌలర్లలో దక్షిణాఫ్రికా బౌలర్ తబ్రియాజ్‌ షంషీ 733 పాయింట్లతో అగ్రస్థానంలో ఉండగా.. అప్ఘన్‌ బౌలర్‌ రషీద్‌ ఖాన్‌ 719 పాయింట్లతో రెండో స్థానంలో ఉన్నాడు. ఇక ఆసీస్‌ బౌలర్‌ ఆస్టన్‌ అగర్‌ 702 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచాడు. అలాగే ఆల్‌రౌండర్‌ విభాగంలో ఆఫ్ఘన్‌కు చెందిన మహ్మద్‌ నబీ 285 పాయింట్లతో మొదటి స్థానంలో ఉండగా.. బంగ్లా స్టార్‌ ఆల్‌రౌండర్‌ షకీబ్‌ అల్‌ హసన్‌ 248 పాయింట్లతో రెండో స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. ఆ తర్వాత మూడో స్థానంలో ఆసీస్‌ ఆల్‌రౌండర్‌ గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌ 226 పాయింట్లతో కొనసాగుతున్నాడు.

కాగా.. జట్ల విభాగంలో 272 పాయింట్లతో ఇంగ్లండ్‌ టాప్‌ స్థానంలో కొనసాగుతుండగా.. భారత్‌ 270 పాయింట్లతో రెండో స్థానంలో.. ఆస్ట్రేలియా 267 పాయింట్లతో మూడో స్థానంలో ఉంది. పాకిస్తాన్ 260 పాయింట్లతో నాలుగో ర్యాంకులో, న్యూజిల్యాండ్ 225 పాయింట్లో ఐదో స్థానంలో ఉన్నాయి. త్వరలో టీ20 ప్రపంచకప్ రానున్న నేపథ్యంలో టీమిండియా ర్యాకింగ్స్ అభిమానుల్లో కొంత ఆందోళన కలిగిస్తున్నాయి. అయితే ఐపీఎల్ తరువాత ఇంగ్లండ్‌ టూర్, స్వదేశంలో సౌత్ ఆఫ్రికాతో టీ20 సిరీస్‌లోనైనా మళ్లీ సత్తా చాటాలని కోరుకుంటున్నారు.

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments

Related Articles

Social Share

3,894FansLike
3,576FollowersFollow
3,976FollowersFollow
2,480FollowersFollow
1,267FollowersFollow
7,784SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -
0
Would love your thoughts, please comment.x
()
x