భారత్, పాకిస్తాన్ జట్లు టీ20 సిరీస్ ఆడుతున్నాయి. నేటి నుంచి బంగ్లాదేశ్‌తో జరగనున్న ట్రై సిరీస్‌లో ఈ దాయాది దేశాలు పాల్గొననున్నాయి. ఇండియా-పాకిస్తాన్ జట్ల మధ్య త్వరలో టీ20 సిరీస్ జరగనుందని ఆ దేశ మీడియా ఇటీవల ప్రముఖంగా ఓ వార్తను ప్రచురించింది. దీంతో క్రికెట్ అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ క్రమంలోనే ఇరు దేశాల బ్లైండ్(అంధ) క్రికెట్ జట్లు బంగ్లాదేశ్‌లో పర్యటించనున్నాయి. నేటి నుంచి ప్రారంభమైన ఈ టోర్నీ 8వ తేదీ వరకు జరగనుంది. ఈ ట్రై సిరీస్‌లో మూడు దేశాలు ఆడనున్నా అందరి దృష్టి భారత్- పాకిస్తాన్ జట్ల మధ్య సజరిగే మ్యాచ్‌ల పైనే ఉంది. ఈ ఫార్మాట్ లో అసలైన పోటీ దాయాదుల మధ్య ఉండనుంది.
ఈ టీ 20 సిరీస్‌లో భారత్, పాకిస్థాన్‌తో పాటు మూడో జట్టుగా బంగ్లాదేశ్ ఆడనుండగా.. ఈ టోర్నీ మొత్తం ఢాకాలో జరుగుతాయి. ఈ సిరీస్‌కు సంబంధించిన అధికారిక ప్రకటనను పాకిస్తాన్ బ్లైండ్ క్రికెట్ కౌన్సిల్ వెలువరించింది. ఇందులో ఏప్రిల్ 4న భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య సిరీస్‌లో తొలి సారిగా తలపడనున్నాయి. ఈ విషయాన్ని కూడా పాక్ బ్లైండ్ క్రికెట్ కౌన్సిల్ అధికారి తెలిపారు. ఈ సిరీస్ తొలి మ్యాచ్‌లో భారత్‌తో బంగ్లాదేశ్ తలపడనుంది.
ఈ సిరీస్ పై పాకిస్తాన్ బ్లైండ్ క్రికెట్ కౌన్సిల్ అధికారి మాట్లాడుతూ.. ‘టీ20 సిరీస్‌లో పాల్గొననున్న ఆటగాళ్లందరూ కరోనా పరీక్ష చేయించుకున్నారు. వీటి ఫలితాలన్నీ నెగెటివ్ రిపోర్టులే వచ్చాయి. భారత్, బంగ్లాదేశ్ ఆటగాళ్లకు కూడా కరోనా నెగెటివ్ వచ్చాయని తెలిపారు. సిరీస్ షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ 2 న ప్రారంభ మ్యాచ్‌లో భారత్, బంగ్లాదేశ్ ముఖాముఖి తలపడనుండగా.. పాకిస్తాన్, బంగ్లాదేశ్ ఏప్రిల్ 3 న తలపడనున్నాయి. ఏప్రిల్ 4 న భారత్, పాకిస్తాన్ జట్లు ఒకరినొకరు ఢీ కొట్టేందుకు సన్నద్దమవుతున్నారు. ఏప్రిల్ 5 విశ్రాంతి దినం ఆపై ఏప్రిల్ 6 న పాకిస్తాన్, బంగ్లాదేశ్ మధ్య పోటీ ఉంటుంది. ఏప్రిల్ 7 న భారత జట్టు మరోసారి పాకిస్థాన్‌తో తలపడనుంది. మొదటి రెండు జట్ల మధ్య ఏప్రిల్ 8 న టైటిల్ మ్యాచ్ జరుగుతుంది.
కాగా.. పాకిస్తాన్, భారత్ మధ్య ఇటీవల సానుకూల వాతావరణం ఏర్పడుతున్న నేపథ్యంలో ఇరు జట్ల మధ్య మళ్లీ క్రికెట్ మ్యాచ్‌లు జరుగుతాయని రెండు దేశాల్లోని క్రికెట్ అభిమానులు భావిస్తున్నారు. అంతేకాకుండా ఐపీఎల్‌లో కూడా పాక్ ఆటగాళ్లు మళ్లీ పాల్గొనే అవకాశం ఉందని కూడా వార్తలు వినిపిస్తున్నాయి. ఇదే నిజమైతే పాక్ ఆటగాళ్ల 12ఏళ్ల నిరీక్షణకు తెరపడినట్లే. చివరిగా పాక్ ఆటగాళ్లు 2012లో ఐపీఎల్‌లో పాల్గొన్నారు.