Friday, November 1, 2024

ఆర్సీబీ డ్రెస్ లో మాక్స్ వెల్ ప్రాక్టీస్.. వైరల్ అవుతున్న ఫోటో

చెన్నై: ఐపీఎల్ ప్రారంభం అవుతుందంటే చాలు అభిమానుల ఆనందానికి అవధులుండవు. అద్బుత ఆటగాళ్లతో ఏర్పడిన జట్ల మధ్య జరిగే పోటీలు అభిమానులకు అదిరిపోయే ఆనందాన్నిస్తాయి. ప్రతి జట్టుకు ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంటుంది. ఆర్సీబీ కూడా అలాంటి జట్లలో ఒకటి. ఇప్పటివరకు ఒక్కసారి కూడా కప్పు గెలవకపోయినా ఈ జట్టుపై ఫ్యాన్స్ కు అభిమానం తగ్గలేదు. అయితే ఇటీవల ఫిబ్రవరిలో జరిగిన మినీ వేలంలో ఆర్‌సీబీ ఆసీస్‌ స్టార్‌ ఆల్‌రౌండర్‌ గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌ను కొనుగోలు చేసింది. అతడి కోసం ఏకంగా రూ.14.25 కోట్లు పోసి సొంతం చేసుకుంది.

గతేడాది సీజన్‌లో మ్యాక్స్‌వెల్‌ కింగ్స్‌ పంజాబ్(పంజాబ్‌ కింగ్స్‌) తరపున ఆడాడు. ఆ సీజన్‌లో మ్యాక్సీ దారుణ ప్రదర్శన కనబరిచి అభిమానులకు నిరాశపరిచాడు. అయినా ఈ ఏడాది వేలంలో అంత ధరకు పలకడం చూస్తే అతని క్రేజ్‌ ఏ మాత్రం తగ్గలేదని అర్థమవుతుంది. ఐపీఎల్‌లో ఆడేందుకు మ్యాక్సీ ఇండియాకు ఇటీవలే చేరుకున్నాడు. వచ్చీరాగానే జట్టుతో కలిసి ప్రాక్టీస్‌ మొదలెట్టేశాడు. ఈ సందర్భంగా ఆర్సీబీ జెర్సీలో ప్రాక్టీస్‌ చేస్తున్న మ్యాక్స్ వెల్ ఫోటోను జట్టు యాజమాన్యం తమ ట్విటర్‌లో షేర్‌ చేసింది. దీనిపై నెటిజన్లు కూడా తమ స్టైల్ లో కామెంట్స్‌ చేస్తున్నారు. ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతొంది.

”ఆర్‌సీబీ కలర్‌ఫుల్‌ జెర్సీలో మ్యాక్సీని చూడడం ఆనందంగా ఉంది. ఇటువంటి ఫోటో కోసం ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్నా” అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. అలాగే జెర్సీలో కలర్‌ఫుల్‌గా ఉన్నావు.. టైటిల్‌ సంగతేంటి” అని కొందరు నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఇక మరికొందరైతే మ్యాక్సీ – విరాట్‌ కలిసి ఇన్నింగ్స్‌ ఆరంభిస్తే బాగుంటుందంటూ సలహాలు కూడా ఇస్తున్నారు.

ఇదిలా ఉంటే మ్యాక్స్ వెల్ ఆర్‌సీబీ తరుపున మైదానంలో అడుగు పెట్టి సిక్సర్ల మోతమోగిస్తాడని అభిమానులు వేచిచూస్తున్నారు. మరి వారి అంచనాలకు తగ్గ ప్రదర్శన చేస్తాడా లేదా అని చూడాలి. కాగా.. మ్యాక్స్‌వెల్‌ ఐపీఎల్‌లో ఇప్పటివరకు 82 మ్యాచ్‌లు ఆడాడు. వాటన్నింటిలో కలిపి 1505 పరుగులు చేశాడు. ఇక గతేడాది సీజన్‌ విషయానికొస్తే పంజాబ్‌కు ఆడిన మ్యాక్సీ 13 మ్యాచ్‌ల్లో కేవలం 108 పరుగులు మాత్రమే చేశాడు.

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments

Related Articles

Social Share

3,894FansLike
3,576FollowersFollow
3,976FollowersFollow
2,480FollowersFollow
1,267FollowersFollow
7,784SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -
0
Would love your thoughts, please comment.x
()
x