ఐపీఎల్ అంటే భారత్‌లో ఏ స్థాయిలో క్రేజ్ ఉందో వేరే చెప్పనక్కర్లేదు. టోర్నీ మొదలువుతుందంటే చాలు.. తాము అభిమానించే జట్టు ట్రోఫీ కొట్టాలని, తమ అభిమాన ఆటగాడు చెలరేగి ఆడాలని అంతా కోరుకుంటుంటారు. అయితే టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ సారథ్యంలోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు మాత్రం ఇప్పటివరకు ఆ అదృష్టం వరించలేదు. దాదాపు ఐపీఎల్ ప్రారంభం నుంచి ట్రోఫీ కోసం చెమటోడ్చుతున్నా ఒక్కసారి కూడా దానిని ముద్దాడలేకపోయింది. ఈ క్రమంలోనే 13 ఏళ్ల నిరీక్షణకు ఈ ఏడాది సీజన్‌తో అయినా ఫుల్ స్టాప్ పడాలని ఆర్సీబీ ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఈ క్రమంలోనే ముంబైతో జరిగిన తొలి మ్యాచ్ విజయం తరువాత తమ తమ స్టైల్స్‌లో బెంగళూరుకు విషెస్ చెబుతున్నారు. ఈ జోరు టోర్నీ ఆసాంతం కొనసాగించాలని, ట్రోఫీ కొట్టే వరకు ఆడకూడదని ట్విట్లు చేస్తూ సోషల్ మీడియాను హోరెత్తిస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తాజా చిత్రం పుష్ప సినిమాలోని అతడి లుక్‌లో కోహ్లీని రెడీ చేశారు. అలాగే పుష్ప సినిమాలో బాగా పాపులర్ అయిన ‘తగ్గేదే..లే’ డైలాగ్‌తో ఉన్న కోహ్లీ పోస్టర్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. ఈ పోస్టర్‌ను ఏకంగా స్టార్ స్పోర్ట్స్ తయారు చేసి తన అఫీషియల్ ట్విటర్‌లో షేర్ చేసింది. దానికి ‘తగ్గేదే… లే’ అనే కామెంట్‌ను జత చేసింది.
‘తగ్గేదే.. లే ఆరంభం అదిరింది.. ఓటమి సరిహద్దుల దాకా వెళ్ళి విజృంభించే ప్రదర్శన మాదే అన్నట్టు ఆడేసారు.. సరిలేరు మీకెవ్వరు అనే మాటకి నిదర్శనంగా నిలిచారు” అంటూ రాసుకొచ్చింది. స్టార్ స్పోర్ట్స్ తెలుగు పెట్టిన ఈ కామెంట్ ఇప్పుడు ట్రెండింగ్‌లో నిలిచింది. నెటిజన్లు కూడా ఆర్‌సీబీ మద్దతుగా కామెంట్స్ చేశారు. అవును టైటిల్ గెలిచేవరకు తగ్గేదే..లే.. అంటూ కామెంట్లు పెట్టారు. కాగా ఆర్‌సీబీ తన తర్వాతి మ్యాచ్‌ను ఏప్రిల్ 14న చెన్నై వేదికగా సన్‌రైజర్స్‌తో తలపడనుంది.