Sunday, March 22, 2026

రైజర్స్‌పై రైడర్స్‌దే పైచేయి.. తొలి మ్యాచ్‌లో..

ఐపీఎల్ 14వ సీజన్‌లో భాగంగా ఆదివారం జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై కోల్‌కతా నైట్ రైడర్స్ ఘన విజయం సాధించింది. దీంతో ఈ ఏడాది ఐపీఎల్‌లో తొలి మ్యాచ్‌లోనే బోణీ కొట్టింది. టాస్ గెలిచిన సన్ రైజర్స్ బౌలింగ్ ఎంచుకోవడంతో కేకేఆర్ బ్యాటింగ్‌కు దిగింది. ఓపెనర్ నితీశ్ రాణా(80: 56 బంతుల్లో, 9 ఫోర్లు, 4 సిక్సులు), శుభ్‌మన్ గిల్(15: 13 బంతుల్లో 1 ఫోర్, 1 సిక్స్) చక్కటి ఆరంభాన్నిచ్చారు. పవర్ ప్లే పూర్తయిన తర్వాత గిల్ అవుటైనా.. వన్ డౌన్‌లో వచ్చిన రాహుల్ త్రిపాఠి(53: 29 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సులు)తో కలిసి రాణా ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఇద్దరూ ఎడాపెడా బౌండరీలు బాదుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. దీంతో కేకేఆర్ 15 ఓవర్లలోనే 145 పరుగుల భారీ స్కోరు చేసింది. అయితే ఆ తర్వాతి ఓవర్లోనే రాహుల్ త్రిపాఠిని సన్‌రైజర్స్ పేసర్ నటరాజన్ అవుట్ చేయడంతో భారీ భాగస్వామ్యానికి తెరపడింది. ఆ తర్వాత దినేశ్ కార్తిక్(22 నాటౌట్: 9 బంతుల్లో, 2 ఫోర్లు, 1 సిక్స్) తప్ప మిగతా బ్యాట్స్‌మన్ ఎవరూ రాణించలేదు. దీంతో భారీ స్కోరు చేస్తుందనుకున్న కేకేఆర్.. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 187 పరుగులు మాత్రమే చేసింది.

అనంతరం 188 పరుగులు టార్గెట్‌తో బరిలోకి దిగిన సన్ రైజర్స్‌కు కేకేఆర్‌ పేసర్ ప్రసిద్ధ్ కృష్ణ రెండో ఓవర్లోనే షాకిచ్చాడు. రైజర్స్ కెప్టెన్ డేవిడ్ వార్నర్‌(3)ను పెవిలియన్‌కు పంపి వారి ఆత్మవిశ్వాసాన్ని దెబ్బ తీశాడు. ఆ తరువాతి ఓవర్లో స్పిన్నర్ షకిబ్ అల్ హసన్ కూడా మరో ఓపోనర్ వృద్ధిమాన్ సాహా(7)ను క్లీన్ బౌల్డ్ చేయడంతో ఎస్‌ఆర్‌హెచ్‌ ఒత్తిడిలో పడింది. మనీష్ పాండే(61 నాటౌట్: 44 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సులు), బెయిర్ స్టో(55: 40 బంతుల్లో, 5 ఫోర్లు, 3 సిక్సులు) ధాటిగా ఆడడంతో సన్ రైజర్స్ మళ్లీ పోటీలోకొచ్చింది. అర్థ సెంచరీ చేసిన తరువాత బెయిర్ స్టో కమిన్స్ బౌలింగ్‌లో బంతిని కట్ చేయబోయి బ్యాక్‌వర్డ్ పాయింట్‌లో ఉన్న రాణాకు క్యాచ్ ఇచ్చాడు. దీంతో వారి భాగస్వామ్యానికి తెరపడింది. ఆ తర్వాత మహ్మద్ నబీ(14), విజయ్ శంకర్(11)లు ఎక్కవ సేపు క్రీజులో నిలవకపోవడంతో రైజర్స్‌కు ఓటమి తప్పలేదు. మనీష్ పాండే చివరి వరకు నాటౌట్‌గానే నిలిచినా.. భారీ షాట్లు ఆడలేకపోయాడు. దీంతో కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 177 పరుగులు మాత్రమే చేసింది. 10 పరుగుల తేడాతో ఓటమి పాలై తొలి మ్యాచ్‌లోనే ఓటమిని మూటగట్టుకుంది.

Related Articles

Social Share

3,894FansLike
3,576FollowersFollow
3,976FollowersFollow
2,480FollowersFollow
1,267FollowersFollow
7,784SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -