యంగ్ అండ్ ప్రామిసింగ్ హీరో అడివిశేష్ మేజర్ గా టైటిల్ రోల్ పోషిస్తున్న చిత్రం ‘మేజర్’. 26/11ముంబై దాడుల్లో దేశం కోసం ప్రాణాలను అర్పించిన దివంగత ఆర్మీ ఆఫీసర్ మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని తెలుగు, హిందీ భాషలలో రూపొందిస్తున్నారు. ఈ ప్యాన్ ఇండియా చిత్రానికి శశి కిరణ్ తిక్కా దర్శకత్వం వహించారు. శోభితా ధూళిపాల, సాయి మంజ్రేకర్, ప్రకాష్ రాజ్, రేవతి, మురళి శర్మ ముఖ్య పాత్రల్లో నటించారు. మహేష్ బాబు GMB ఎంటర్టైన్మెంట్ మరియు ఏప్లస్ఎస్ మూవీస్ సహకారంతో సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా నిర్మిస్తోన్న `మేజర్` చిత్రం జులై2 న ప్రపంచవ్యాప్తంగా విడుదలకాబోతుంది. ఇప్పటికే విడుదలైన క్యారెక్టర్ పోస్టర్, ఫస్ట్ లుక్ పోస్టర్స్‌కి ట్రెమండస్ రెస్పాన్స్ వస్తోంది. కాగా ఈ రోజు (ఎప్రిల్ 12) మేజర్ మూవీ తెలుగు టీజర్‌ను సూపర్‌స్టార్ మహేష్ బాబు, హిందీ వెర్షన్ టీజర్‌ను సల్మాన్‌ఖాన్, మళయాల టీజర్‌ను హీరో పృథ్విరాజ్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా హైదరాబాద్ ఏఎంబి మాల్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో..
దర్శకుడు శశి కిరణ్ తిక్కా మాట్లాడుతూ – “మేజర్ జర్నీ శేష్ నుండే స్టార్ట్ అయ్యింది. ఫస్ట్ ఈ ప్రాజెక్ట్‌లో నేను లేను.. తర్వాత శేష్ ఈ ప్రాజెక్ట్‌లోకి నన్ను తీసుకొచ్చాడు. ముందు ఈ మూవీ చేయొద్దు అనుకున్నాను. కాని శేష్, సందీప్ గురించి నాకు చెప్పినప్పుడు, తర్వాత వారి తల్లిదండ్రులను వెళ్లి కలిసినప్పుడు ఇది చెప్పకపోతే తప్పు అవుతుందని భావించాను. సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం నన్ను కదిలించిన, ఇన్స్‌పైర్ చేసిన విధానం ఈ సినిమాతో రెండేళ్లు జర్నీ చేయించింది. నా లైఫ్ లాంగ్ ఈ మూవీ గురించి చాలా గర్వంగా చెప్పుకుంటాను“ అన్నారు.
హీరోయిన్ సాయి మంజ్రేకర్ మాట్లాడుతూ- “ఈ మూవీ షూటింగ్ చాలా ఫన్నీగా జరిగింది. ఈ సినిమా నా దగ్గరకు వచ్చినప్పుడు ఫస్ట్ మా పేరెంట్స్ నువ్వు తప్పకుండా చేయాలి అని చెప్పారు. వాళ్ల సపోర్ట్ తోనే ఈ మూవీ చేయగలిగాను. ఈ మూవీ ఒక గ్రేట్ లెర్నింగ్ ఎక్స్‌పీరియన్స్. ఇంకా నాలుగు రోజులు షూట్ బ్యాలెన్స్ ఉంది. ఈ మూవీ రిలీజ్ కోసం చాలా ఈగర్‌గా వెయిట్ చేస్తున్నాను“ అన్నారు.
హీరోయిన్ శోభిత ధూళిపాల మాట్లాడుతూ- “ఇదే థీమ్‌తో గూడఛారి మూవీ షూట్ చేశాం.. కాబట్టి ఈ టీమ్‌తో మంచి అనుబంధం ఏర్పడింది. మేజర్ లాంటి ఒక గొప్ప మూవీలో భాగం అవడం చాలా గర్వంగా ఉంది. ప్రతి సీన్ రెండు భాషలలో షూట్ చేశాం. మా టీమ్ అందరికీ ఒక యూనిక్ ఎక్స్‌పీరియన్స్. షూటింగ్ చేసిన ప్రతి రోజు చాలా హ్యాపీగా ఫీలయ్యాం“ అన్నారు.
నిర్మాత శరత్ మాట్లాడుతూ – “ఇది ఒక థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్ మూవీ. మాకు సపోర్ట్ చేసిన నమ్రత మేడమ్, మహేష్ సర్‌కి థ్యాంక్స్. అలాగే సోనీ పిక్చర్స్ వారు మాతో భాగస్వామ్యం అవడం హ్యాపీ. ఈ సినిమాలో వర్క్ చేసిన ప్రతి ఒక్కరికీ థ్యాంక్యూ సో మచ్“ అన్నారు.
నిర్మాత అనురాగ్ మాట్లాడుతూ- “మేం చెప్పిన కాన్సెప్ట్‌ని నమ్మి ఈ ప్రాజెక్ట్‌లో భాగం అయిన నమ్రత, మహేష్‌బాబు గారికి ధన్యవాదాలు. సోనీ పిక్చర్స్ వారు ఎన్నో భాషలలో సినిమాలు చేశారు. వారు ఎక్కడికి వెళ్లినా ఈ సినిమా హైదరాబాద్ నుండే చేశాం అని గర్వంగా చెప్పుకునే విధంగా ఈ సినిమా ఉంటుంది. అలాగే మమ్మల్ని నమ్మి ఈ అవకాశం ఇచ్చిన శేష్‌కి థ్యాంక్స్. శశి చాలా బ్యాటిఫుల్‌గా ఈ మూవీని తెరకెక్కించారు. యంగ్ టీమ్ అందరం కలిసి చేసిన మూవీ ఇది. ఈ టీమ్‌లో భాగం కావడం చాలా హ్యాపీగా ఉంది“ అన్నారు.
అడివిశేష్ మాట్లాడుతూ – “2008లో ముంబై ఎటాక్స్ జరిగినప్పుడు నేను యూఎస్‌లో ఉన్నాను. సందీప్ ఫోటో చూసినప్పుడు నాకు అన్నయ్యలా ఉన్నారు అనిపించింది. ఒక సొంత అన్నయ్యను కోల్పోయాం అనే ఫీలింగ్ వచ్చింది. మీరు ఇప్పటికీ ఆయన పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో చూసినట్లయితే కళ్లలో ఆ ఇంటెన్సిటీ ఉంటుంది కాని.. ఫేస్‌లో మాత్రం చిన్న స్మైల్ ఉంటుంది. అది నన్ను బాగా ఇన్స్‌పైర్ చేసింది. అప్పటినుండి ఆయనకు ఫ్యాన్ అయ్యాను. అనురాగ్, సాయి వచ్చి నీ డ్రీమ్ ప్రాజెక్ట్ ఏంటి అని అడిగిన్పపుడు సందీప్ లైఫ్ స్టోరీ ఎందుకు చెప్పకూడదు అని అన్నాను. వారు ఒకే అన్నాక నా ఫస్ట్ ఛాలెంజ్ సందీప్ పేరెంట్స్‌ని ఒప్పించడం. కేవలం కమర్షియల్‌గానే కాకుండా జెన్యూన్‌గా చేద్దాం అని చాలా కష్టపడి వారిని ఒప్పించాం. ఈ ప్రాజెక్ట్ ఎనౌన్స్ చేయగానే మేజర్ సందీప్ గారి మ్యూజియంలో యూనిఫామ్ లేఅవుట్ ఎలా ఉంటుందో అలాంటి యూనిఫామ్‌లోనే ఫోటోషూట్ చేసి ఎనౌన్స్‌మెంట్ పోస్టర్ గా రిలీజ్‌చేశాం. మనస్పూర్తిగా చేసిన మూవీ కాబట్టి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాలో అన్ని అంశాలు ఉన్నాయి. కొంత మంది డిస్ట్రిబ్యూటర్స్ నన్ను అడిగారు ఇది ఏ సెంటర్ ఫిలిమా? లేదా బీసి సెంటర్స్ సినిమానా? అని.. వారందరికీ నేను ఒక్కటే చెప్పదలుచుకున్నాను, ఇది మనిషికి నచ్చే ఫిలిం. మనిషిలోని ప్రతి ఫీలింగ్‌ని చూపించే చిత్రమిది. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ చనిపోయిన విధానం మాత్రమే కాకుండా, అతను జీవించిన విధానం యొక్క సోల్‌ని సంగ్రహించి మేజర్ సందీప్ జీవితాన్నిసెలబ్రేట్ చేయడమే మా ఉద్దేశ్యం. మాకు సపోర్ట్ చేస్తున్న మీడియావారికి, మా నిర్మాతలకి థ్యాంక్స్. సోనీ పిక్చర్స్ వారి భాగస్వామ్యంతో మా సినిమా ఇంటర్‌నేషనల్ లెవల్‌కి వెళ్లింది. హైదరాబాద్‌లో తీయాలనుకున్న మా సినిమా ఎనౌన్స్‌మెంట్ వెరైటీ మ్యాగజైన్ హాలీవుడ్ రిపోర్టర్స్ లో అయింది. ఒక అప్‌కమింగ్ యాక్టర్‌కి అదొక కిక్. మా సినిమా టీజర్ ని మూడు భాషల్లో ముగ్గురు హ్యూజ్ స్టార్స్ లాంచ్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. హిందీ టీజర్ లాంచ్ చేసిన సల్మాన్‌ఖాన్ గారికి, మళయాలం టీజర్ రిలీజ్ చేసిన పృథ్విరాజ్ గారికి థ్యాంక్స్. మమ్మల్ని నమ్మి ఈ ప్రాజెక్ట్ కి పూర్తి సపోర్ట్ అందించిన నమ్రత మేడమ్, మహేష్ సర్‌కి స్పెషల్ థ్యాంక్స్. వారి గైడెన్స్ ఎప్పటికీ మేం మర్చిపోలేము.. ఈ సినిమాకి వర్క్ చేసిన ప్రతి ఒక్క ఆర్టిస్ట్, టెక్నీషియన్ కి ధన్యవాదాలు“ అన్నారు.