‘పవర్ స్టార్’ పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్’ సినిమా ఓటీటీలో రిలీజ్ కాబోతోంది అనే ప్రచారాన్ని నిర్మాత దిల్ రాజు, దర్శకుడు శ్రీరామ్ వేణు ఖండించారు. “వకీల్ సాబ్ ” సినిమాను థియేటర్ లోనే చూసి ఎంజాయ్ చేయాలని వారు కోరారు.
నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ…వకీల్ సాబ్ సినిమాకు థియేటర్ లో సూపర్ రెస్పాన్స్ ఉంది. ఈ చిత్రాన్ని ఓటీటీలో రిలీజ్ చేస్తున్నాం అనే వార్తల్లో నిజం లేదు. ఇంత పెద్ద సినిమాను థియేటర్ లో చూస్తే వచ్చే ఆనందం ఓటీటీలో చూస్తే రాదు. ఏ స్టార్ హీరో సినిమా అయినా 50 రోజుల తర్వాతే ఓటీటీలో రిలీజ్ చేయాలనే రూల్ ఉంది. కాబట్టి కరోనా జాగ్రత్తలు తీసుకుంటూ వకీల్ సాబ్ చిత్రాన్ని థియేటర్ లో చూడండి. అన్నారు.
Putting Rumours To Rest… Watch #VakeelSaab Only In Theatres@PawanKalyan #SriramVenu @shrutihaasan @i_nivethathomas @yoursanjali @AnanyaNagalla @SVC_official @MusicThaman @bayviewprojoffl @BoneyKapoor @adityamusic#VakeelSaabJusticeServed pic.twitter.com/eEQBPUcMDL
— Sri Venkateswara Creations (@SVC_official) April 12, 2021
దర్శకుడు శ్రీరామ్ వేణు మాట్లాడుతూ…. వకీల్ సాబ్ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేయడం లేదు. అలాంటి వార్తలన్నీ ఫేక్. పవర్ స్టార్ సినిమాను థియేటర్ లోనే చూడండి. అన్నారు.