తరువాత భారత్‌లో అడుగుపెట్టనుంది. కానీ, భారత్‌కు పాక్ జట్టు వచ్చేందుకు ఇక్కడి ప్రభుత్వం అనుమతిస్తుందా..? లేదా..? అనే అనుమానాలు సర్వత్రా నెలకొన్నాయి. అయితే ఆ అనుమానాలన్నింటినీ బీసీసీఐ తొలగించింది. అక్టోబర్‌లో జరిగే ఐసీసీ వరల్డ్ టీ20 కోసం భారత్‌కు వచ్చేందుకు పాకిస్తాన్ జట్టుకు లైన్ క్లియర్ చేసింద. దాయాది దేశం నుంచి ఆటగాళ్లు భారత్‌కు వచ్చి ఆడేందుకు అవరసరమైన ప్రభుత్వం వీసాలు మంజూరు చేసేందుకు ఓకే చెప్పింది. పాకిస్తాన్ ఆటగాళ్లకు వీసాలు ఇవ్వాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని బీసీసీఐ సెక్రటరీ జై షా ఇప్పటికే అపెక్స్ కౌన్సిల్‌కు వెల్లడించారు.
భారత్-పాకిస్తాన్ దేశాల మధ్య రాజకీయంగా కొన్నేళ్లుగా ద్వేపాక్షిక పరిస్థితులు దెబ్బతినడంతో ఇరు జట్ల మధ్య క్రికెట్ సంబంధాలను పూర్తిగా చెరిగిపోయాయి. దీంతో దాదాపు దశాబ్ద కాలంగా ఈ రెండు జట్లూ కలిసి ఎలాంటి ద్వైపాక్షిక సిరీస్‌లూ ఆడలేదు. అయితే అంతర్జాతీయ క్రికెట్ మండలి టోర్నీల్లో మాత్రం అప్పుడప్పుడూ ఎదురుపడ్డా.. ప్రతిసారీ టీమిండియానే విజయం సాధిస్తోంది. కాగా.. తాజాగా మళ్లీ ఐసీసీ టీ20 వరల్డ్ కప్ జరగనుండడం, అది కూడా భారత్‌లో జరగనుండడంతో పాక్ జట్టును భారత ప్రభుత్వం దేశంలోకి అనుమతిస్తుందా..? లేదా..? అనే విషయంలో సర్వత్రా ఆందోళన నెలకొంది.
పాక్ క్రికెట్ బోర్డు కూడా దీనిపై గతేడాది నుంచి ఆందోలన వ్యక్తం చేస్తోంది. ఐసీసీకి కూడా ప్రత్యేకంగా లేఖ రాసింది. ఈ నేపథ్యంలోనే పాక్ బోర్డు నిరీక్షణకు బీసీసీఐ తెరదింపింది. పాక్ జట్టు భారత్‌లో పర్యటించేందుకు ఆ దేశ ఆటగాళ్లందరికీ భారత ప్రభుత్వం వీసాలు జారీ చేయనున్నట్లు బీసీసీఐ వెల్లడించింది. ‘పాకిస్తాన్ క్రికెట్ జట్టుకు వీసా సమస్య తీరిపోయింది. అయితే మ్యాచ్‌లు చూడడానికి అభిమానులు సరిహద్దులు దాటి వచ్చేందుకు అనుమతించడంపై ఇంకా స్పష్టత లేదు. దీనిపై కూడా త్వరలోనే నిర్ణయం వెలువడుతుంది. దీన్ని త్వరలోనే పరిష్కారం అవుతుందని మేము ఐసీసీకి హామీ ఇచ్చాం’’ అని బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్ సభ్యుడొకరు మీడియాకు వెల్లడించారు.