క్రికెట్లో తొడగొట్టి సెలబ్రేట్ చేసుకునే ఏకైక ఆటగాడు టీమిండియా ఓపెనర్ శిఖర్ ధవన్. తాజాగా ఐపీఎల్‌లో కూడా శిఖర్.. తన జట్టుకు వికెట్ దక్కినప్పుడల్లా తన స్టైల్లో తొడగొట్టి సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ముఖ్యంగా అతడే స్వయంగా క్యాచ్ అందుకున్నాడంటే ఇక తొడగొట్టకుండా అతడిని ఎవరూ ఆపలేరు. తాజాగా ధవన్ తొడగొట్టడంపై సోషల్ మీడియాలో కొంతమంది ట్రోల్స్ చేస్తున్నారు. మరికొందరు సెటైర్లు విసురుతున్నారు. అయితే తనపై ట్రోల్స్ చేస్తున్నవారందరికీ పంజాబ్ మ్యాచ్ ముగిసిన తర్వాత ధవన్ ఒక్క దెబ్బతో కౌంటర్ ఇచ్చాడు. నవ్వుతూనే ట్రోల్ చేస్తున్న వాళ్ల నోర్లు మూయించాడు.
పంజాబ్‌తో మ్యాచ్‌లో 92 పరుగులతో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడిన ధవన్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. అప్పుడే తొడగొట్టడం గురించి కామెంటేటర్ ధవన్‌ను ప్రశ్నించాడు. క్యాచ్ పట్టిన ప్రతిసారీ తొడగొట్టడంపైనెటిజన్లు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారని, తొడ కందిపోయిందేమోనంటూ సెటైర్లు వేస్తున్నారని చమత్కరించాడు. దీనికి ధవన్ తన స్టైల్లో సమాధానమిచ్చాడు. ‘నా తొడలు చాలా బలంగా ఉంటాయి. ఎన్నిసార్లు తొడగొట్టినా వాటికేమీ కాదు. వాటి గురించి ఎవరూ భయపడాల్సిన పనిలేదం’టూ కౌంటర్ ఇచ్చాడు. కామెంటేటర్లు కూడా తన తొడగొట్టడంపై కామెంట్లు చేశారని, వారికి కూడా ఈ విషయం చెబుతున్నానంటూ చురకలంటించాడు.
ఇదిలా ఉంటే పంజాబ్‌తో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ అద్భుత విజయం సాధించింది. ఢిల్లీ ఓపెనర్ శిఖర్ ధవన్(92: 49 బంతుల్లో.. 13 ఫోర్లు, 2 సిక్స్‌లు) సూపర్ ఇన్నింగ్స్‌తో ఢిల్లీ అలవోకగా గెలిచింది. పంజాబ్ బౌలర్లను మట్టి కరిపిస్తూ మైదానంలో ధవన్ బౌండరీల వర్షం కురిపించాడు. దీంతో 196 పరుగుల లక్ష్యాన్ని మరో 10 బంతులు మిగిలుండగానే ఢిల్లీ ఛేదించింది. దీంతో టోర్నీలో రెండో విజయంతో ఢిల్లీ పాయింట్ల పట్టికలో సెకండ్ ప్లేస్‌కు చేరింది.