Friday, November 1, 2024

వ్యాక్సిన్ తీసుకున్న కోహ్లీ.. వెంటనే ఏం చెప్పాడంటే..

ఐపీఎల్ వాయిదా తరువాత బయోబబుల్ నుంచి బయటకొచ్చిన టీమిండియా క్రికెటర్లంతా వరుసగా కరోనా వ్యాక్సిన్ వేయించుకుంటున్నారు. ఇప్పటికే టీమిండియా ఓపెనర్ శిఖర్ ధవన్, టెస్ట్ వైస్ కెప్టెన్ ఆజింక్య రహానే(భార్యతో పాటు) వ్యాక్సిన్ మొదటి డోస్ తీసుకున్నారు. తాజాగా ఈ జాబితాలోకి టీమిండియా టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ కూడా చేరాడు. సోమవారం కోహ్లీ కరోనా వ్యాక్సిన్‌ తొలి డోస్‌ తీసుకున్నాడు. ఇందుకు సంబంధించిన ఫొటోను తన సోషల్‌ మీడియాలో షేర్‌ చేశాడు. అందరూ వ్యాక్సిన్ తీసుకోవాలని, సురక్షింతగా ఉండాలని కోరాడు. ‘‘వీలైనంత త్వరగా వ్యాక్సిన్‌ వేయించుకోండి. సురక్షితంగా ఉండండి’’ అంటూ విజ్ఞప్తి చేశాడు.

ఐపీఎల్ వాయిదా తరువాత కోహ్లీ.. తన భార్యతో కలిసి ప్రారంభించిన కోవిడ్ రిలీఫ్ క్యాంపెయిన్ నిర్వహిస్తూ విరాళాలు సేకరిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే వ్యాక్సినేషన్‌పై అవగాహన కల్పిస్తున్నాడు. ఈ క్రమంలోనే సోమవారం టీకా తొలి డోసు తీసుకున్నాడు. ఆ సమయంలోనే కరోనాపై పోరాటంలో ముందుండి సేవలు అందిస్తున్న ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌ అంతా నిజమైన హీరోలంటూ అభినందించాడు. వారందరికీ ధన్యవాదాలు తెలిపాడు. అందరం వారికి రుణపడి ఉండాలని అన్నాడు.

కాగా.. మహమ్మారి కరోనా ఉధృతి నేపథ్యంలో ఐపీఎల్‌-2021 సీజన్‌ నిరవధికంగా వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇంటికి చేరుకున్న ఆర్సీబీ సారథి కోహ్లి.. భార్య అనుష్క శర్మతో కలిసి కోవిడ్‌పై పోరుకు రూ. 2 కోట్లు విరాళం ఇవ్వడంతో పాటు తమవంతుగా విరాళాలు సేకరించే కార్యక్రమాన్ని కూడా ప్రారంభించారు. విరుష్క దంపతులు ప్రారంభించిన ఈ క్యాంపెయినింగ్‌కు ఇప్పటికే భారీ స్పందన వచ్చింది. క్యాంపెయిన్ మొదలు పెట్టిన 24 గంటల్లోనే రూ.3.6 కోట్ల రూపాయలు జమయ్యాయి. ఈ విషయాన్ని కోహ్లీ స్వయంగా వెల్లడించాడు.

ఇదిలా ఉంటే ఈ రోజు కోహ్లీ మాత్రమే కాకుండా టీమిండియా సీనియర్ పేసర్ ఇషాంత్ శర్మ కూడా కరోనా వ్యాక్సిన్ తీసుకున్నాడు. ఈ విషయాన్ని ఇషాంత్ స్వయంగా వెల్లడించాడు.

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments

Related Articles

Social Share

3,894FansLike
3,576FollowersFollow
3,976FollowersFollow
2,480FollowersFollow
1,267FollowersFollow
7,784SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -
0
Would love your thoughts, please comment.x
()
x