ఇంగ్లండ్ వేదికగా ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ మ్యాచ్ జరగనున్న విషయం తెలిసిందే. టీమిండియా – న్యూజిలాండ్ మధ్య జూన్ 18 నుంచి 22 మధ్య ఈ ఫైనల్ జరగబోతోంది. ఇప్పటికే కివీస్ జట్టు ఇంగ్లండ్‌కు చేరుకోగా.. టీమిండియా జూన్ 2న ఇంగ్లండ్ పర్యటనకు బయల్దేరనుంది. ఈ సమయంలోనే కివీస్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ టీమిండియా గురించి, డబ్ల్యూటీసీ ఫైనల్ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. టీమిండియాతో మ్యాచ్ అంత ఈజీగా ఉండదని, ఆ మ్యాచ్ తమకు కచ్చితంగా గట్టి సవాలేనని కేన్ అన్నాడు.
ఐసీసీ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్ మరో నెలలో జరగనున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నానని కేన్ చెప్పుకొచ్చాడు. ఇటీవల ఐసీసీ ఇంటర్య్వూలో మాట్లాడిన కేన్.. ”ఐసీసీ టెస్టు చాంపియన్‌షిప్ ప్రవేశ పెట్టడంతో సుధీర్ఘ ఫార్మాట్‌పై ఆసక్తి పెరిగింది. ఈ రెండేళ్లలో కొన్ని ఉత్కంతకరమైన టెస్టు సిరీస్‌లు చూశాను. ఆడాను. ఫైనల్ పోరుకు అర్హత సాధించాలనే పట్టుదలతో కొన్ని హోరాహోరీ మ్యాచ్‌లు చూశాను. టీమిండియా-ఆసీస్, న్యూజిలాండ్-పాకిస్తాన్ సిరీస్‌లు ఇందుకు ఉదాహరణ.
ప్రతీ జట్టు ఫైనల్‌కు చేరాలనే పట్టుదలతో చెమటోడ్చి ఆడాయి. కానీ ఫైనల్‌కు మాత్రం 2 జట్లే చేరాలి. అదే ఇప్పుడు జరిగింది. అలా టీమిండియాతో పాటు మేము ఫైనల్‌కు అర్హత సాధించాం. ఇక టీమిండియాతో ఎప్పుడు ఆడిన మాకు కఠిన పరిస్థితులే ఎదురయ్యాయి. వారితో ఆడడం ఎప్పుడు సవాల్‌గానే ఉంటుంది. ఈ సారి కూడా అలాంటి సవాల్ మాకు ఎదురవుతుందని అనుకుంటున్నాం. కానీ గెలుపు కోసం పట్టుదలగా ఉన్నాం. మ్యాచ్ కోసం ఉత్సాహంగా ఎదురు చూస్తున్నాం” అని పేర్కొన్నాడు.
🗣 “It’s really, really exciting to be involved in the final, obviously to win it would be that much better”
One month out from the #WTC21 Final, anticipation is growing among the @BCCI and @BLACKCAPS stars🏆 pic.twitter.com/79uJx2RcQ2
— ICC (@ICC) May 18, 2021
కాగా ఐపీఎల్ 14వ సీజన్ రద్దు తర్వాత కివీస్ ఆటగాళ్లు తమ స్వదేశం వెళ్లలేదు. నేరుగా ఇంగ్లండ్ చేరుకున్నారు. అక్కడే డబ్ల్యూటీసీ ఫైనల్ కోసం కష్టపడి ప్రాక్టీస్ చేస్తున్నారు. అయితే ఈ సిరీస్‌కు ముందు ఇంగ్లండ్‌తో రెండు టెస్టుల సిరీస్ ఆడనుంది. ఇక భారత్ చాంపియన్‌షిప్ ఫైనల్ తర్వాత ఇంగ్లండ్‌తో 5 టెస్టుల సిరీస్‌లో ఢీకొట్టబోతోంది.