మరో రెండు వారాల్లో టీమిండియా ఇంగ్లండ్ బయలుదేరబోతోంది. అక్కడ వరుస టెస్ట్‌లు ఆడబోతోంది. తొలుత జూన్‌లో ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో న్యూజిల్యాండ్‌తో ఆడబోతోంది. ఆ తర్వాత ఆగస్టులో ఇంగ్లండ్‌తో 5 టెస్టుల సిరీస్ ఆడనుంది. దీనికోసం బీసీసీఐ ఇప్పటికే టీమిండియాకు కఠిన నియమాల మధ్య ఉంచుతోంది. అందులో భాగంగా ఇప్పటికే జట్టు సభ్యులంతా తొలి డోసు టీకాలు కూడా తీసుకున్నారు. అయితే రెండో డోసు టీకా ఎప్పుడు తీసుకుంటారనే దానిపై ఇన్నాళ్ళూ సందిగ్ధం నెలకొంది. అయితే తాజాగా బ్రిటీష్ ప్రభుత్వం భారత ఆటగాళ్లకు వ్యాక్సిన్ ఇచ్చేందుకు ఒప్పుకుంది. ఈ ప్రక్రియ మొత్తం తమ దేశ ఆరోగ్యశాఖ పర్యవేక్షణలో జరుగుతుందని అక్కడి ప్రభుత్వం తెలిపింది.
ఐపీఎల్ 14వ సీజన్ అర్థాంతరంగా నిలిచిపోయిన తరువాత భారత ఆటగాళ్లంతా ఇళ్లకు చేరుకున్నారు. ఈ క్రమంలోనే ఆటగాళ్లంతా తమ ఇళ్లకు చేరుకున్నారు. అయితే ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లే ఆటగాళ్లంతా తప్పనిసరిగా వ్యాక్సిన్ తీసుకోవాలని బీసీసీఐ ఆదేశించడంతో ఆటగాళ్లంతా వరుసగా వ్యాక్సిన్ తొలి డోసును తీసుకున్నారు. కెప్టెన్ విరాట్ కోహ్లీ, ఆజింక్య రహానే, రిషబ్ పంత్, ఇషాంత్ శర్మ.. ఇలా టెస్ట్ ఆటగాళ్లంతా వ్యాక్సిన్ తీసుకున్నారు. వీరితో పాటు శ్రీలంక పర్యటనకు వెళ్లే శిఖర్ ధవన్ కూడా తొలి డోసు వ్యాక్సిన్ తీసుకున్నాడు.
కాగా.. ఇంగ్లండ్ పర్యటనకు ముందు ఆటగాళ్లకు బీసీసీఐ వైద్య సిబ్బంది ఆధ్వర్యంలో 3 సార్లు ఆర్టీపీసీఆర్ పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది. ఆ పరీక్షల్లో వారికి నెగిటివ్ రిపోర్ట్ వస్తేనే ఇంగ్లండ్‌కు పంపుతామని బీసీసీఐ తేల్చి చెప్పింది. ఈ క్రమంలోనే 2 వారాల క్వారంటైన్ కోసం ఇప్పటికే టీమిండియా ముంబై చేరుకుంది. అలాగే ఇంగ్లండ్ వెళ్లిన తరువాత అక్కడ కూడా 10 రోజులు క్వారెంటైన్‌లో ఉండోబోతోంది.
భారత టెస్టు జట్టు:
విరాట్ కోహ్లీ(కెప్టెన్), రహానే(వైస్ కెప్టెన్), రోహిత్ శర్మ, శుభమన్ గిల్, మయాంక్ అగర్వాల్, చతేశ్వర్ పుజారా, హనుమ విహారి, రిషబ్ పంత్(కీపర్), రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, జస్ప్రీత్ బుమ్రా, ఇషాంత్ శర్మ, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, శార్ధూల్ ఠాకూర్, ఉమేశ్ యాదవ్.
స్టాండ్‌బై ఆటగాళ్లు: అభిమన్యు ఈశ్వరన్, ప్రసీద్ద్ క్రిష్ణ, అవేష్ ఖాన్, అర్జాన్ నాగ్వాస్వాల్లా.