Sunday, March 22, 2026

ఇండియాతో అంత ఈజీ కాదన్న కివీస్ కెప్టెన్

ఇంగ్లండ్ వేదికగా ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ మ్యాచ్ జరగనున్న విషయం తెలిసిందే. టీమిండియా – న్యూజిలాండ్‌ మధ్య జూన్‌ 18 నుంచి 22 మధ్య ఈ ఫైనల్ జరగబోతోంది. ఇప్పటికే కివీస్‌ జట్టు ఇంగ్లండ్‌కు చేరుకోగా.. టీమిండియా జూన్ 2న ఇంగ్లండ్‌ పర్యటనకు బయల్దేరనుంది. ఈ సమయంలోనే కివీస్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ టీమిండియా గురించి, డబ్ల్యూటీసీ ఫైనల్‌ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. టీమిండియాతో మ్యాచ్ అంత ఈజీగా ఉండదని, ఆ మ్యాచ్ తమకు కచ్చితంగా గట్టి సవాలేనని కేన్ అన్నాడు.

ఐసీసీ టెస్టు చాంపియన్‌షిప్‌ ఫైనల్‌ మరో నెలలో జరగనున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నానని కేన్ చెప్పుకొచ్చాడు. ఇటీవల ఐసీసీ ఇంటర్య్వూలో మాట్లాడిన కేన్.. ”ఐసీసీ టెస్టు చాంపియన్‌షిప్‌ ప్రవేశ పెట్టడంతో సుధీర్ఘ ఫార్మాట్‌పై ఆసక్తి పెరిగింది. ఈ రెండేళ్లలో కొన్ని ఉత్కంతకరమైన టెస్టు సిరీస్‌లు చూశాను. ఆడాను. ఫైనల్‌ పోరుకు అర్హత సాధించాలనే పట్టుదలతో కొన్ని హోరాహోరీ మ్యాచ్‌లు చూశాను. టీమిండియా-ఆసీస్‌, న్యూజిలాండ్‌-పాకిస్తాన్‌ సిరీస్‌లు ఇందుకు ఉదాహరణ.

ప్రతీ జట్టు ఫైనల్‌కు చేరాలనే పట్టుదలతో చెమటోడ్చి ఆడాయి. కానీ ఫైనల్‌కు మాత్రం 2 జట్లే చేరాలి. అదే ఇప్పుడు జరిగింది. అలా టీమిండియాతో పాటు మేము ఫైనల్‌కు అర్హత సాధించాం. ఇక టీమిండియాతో ఎప్పుడు ఆడిన మాకు కఠిన పరిస్థితులే ఎదురయ్యాయి. వారితో ఆడడం ఎప్పుడు సవాల్‌గానే ఉంటుంది. ఈ సారి కూడా అలాంటి సవాల్ మాకు ఎదురవుతుందని అనుకుంటున్నాం. కానీ గెలుపు కోసం పట్టుదలగా ఉన్నాం. మ్యాచ్ కోసం ఉత్సాహంగా ఎదురు చూస్తున్నాం” అని పేర్కొన్నాడు.

కాగా ఐపీఎల్‌ 14వ సీజన్‌ రద్దు తర్వాత కివీస్ ఆటగాళ్లు తమ స్వదేశం వెళ్లలేదు. నేరుగా ఇంగ్లండ్‌ చేరుకున్నారు. అక్కడే డబ్ల్యూటీసీ ఫైనల్‌ కోసం కష్టపడి ప్రాక్టీస్ చేస్తున్నారు. అయితే ఈ సిరీస్‌కు ముందు ఇంగ్లండ్‌తో రెండు టెస్టుల సిరీస్‌ ఆడనుంది. ఇక భారత్‌ చాంపియన్‌షిప్‌ ఫైనల్‌ తర్వాత ఇంగ్లండ్‌తో 5 టెస్టుల సిరీస్‌లో ఢీకొట్టబోతోంది.

Related Articles

Social Share

3,894FansLike
3,576FollowersFollow
3,976FollowersFollow
2,480FollowersFollow
1,267FollowersFollow
7,784SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -