క్రికెట్లో చాలా సార్లు ఆటగాళ్లు అనుకోకుండా చేసే కొన్ని పనులు తెగ నవ్వు తెప్పిస్తుంటాయి. అలాంటి పనులకు సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవతుంటాయి. తాజాగా అదే తరహా వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓ కీపర్ బంతిని అందుకోబోయి బొక్కబోర్లా పడిన సంఘటన ఈ వీడియోలో ఉంది. తాజాగా ఇంగ్లండ్‌లో జరుగుతున్న కౌంటీ చాంపియన్‌షిప్‌లో భాగంగా శుక్రవారం కెంట్, గ్లామోర్గాన్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఈ ఘటన జరిగింది.
కెంట్ బ్యాటింగ్ చేస్తోంది. ఇన్నింగ్స్ 28వ ఓవర్‌ను ఆస్ట్రేలియన్ బౌలర్ మైకెల్ నెసెర్ వేశాడు. నెసెర్ వేసిన బంతిని ఇంగ్లండ్ ఆటగాడు శామ్ బిల్లింగ్స్ ఫైన్‌లెగ్ దిశగా ఆడాడు. బ్యాట్స్‌మెన్ ఇద్దరు కూల్‌గా సింగిల్ కంప్లీట్ చేశారు. వారి వారి క్రీజ్‌లలోకి వెళ్లిపోయారు. అప్పుడే డీప్ స్క్రేర్ లెగ్‌లో ఉన్న పీల్డర్ బంతిని విసరడంతో గ్లమోర్గాన్ కెప్టెన్, వికెట్ కీపర్ క్రిస్ కూక్‌కు దానిని అందుకోబోయాడు. అయితే ఫీల్డర్ బంతిని రాంగ్ సైడ్‌లో వేయడంతో దానిని అందుకునే ప్రయత్నంలో క్రూక్ వికెట్లను చూసుకోలేదు. వెనక్కి జరుగుతూ స్టంప్స్‌కు తగిలాడు. దంతో బ్యాలెన్స్ తప్పి కింద పడిపోయాడు.
బంతిని అందుకోగలిగాడు కానీ అప్పటికే వికెట్లపై నుంచి దాటుతూ కిందపడిపోయాడు. ఓ పల్టీ కొట్టి మరీ బొక్కబోర్లా పడ్డాడు. కూక్ ప్యాంట్‌కు చిక్కుకొని రెండు వికెట్లు మొత్తం బయటికి వచ్చేశాయి. కెప్టెన్ చేసిన పనికి స్లిప్స్‌లో ఉన్న ఆటగాళ్లంతా పగలబడి నవ్వారు. ఈ వీడియోనూ గ్లామోర్గాన్ తన ట్విటర్‌లో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
😂😂😂 @Cooky_24!
His teammates enjoyed this one from the skipper!#GoGlam pic.twitter.com/fRGg7si1md
— Glamorgan Cricket 🏏 (@GlamCricket) May 21, 2021
కాగా.. చిన్న పొరపాటుతో నవ్వులపాలైన కూక్.. అటు కెప్టెన్‌గా, ఇటు బ్యాట్స్‌మన్‌గా అదరగొట్టాడు. కౌంటీ చాంపియన్‌షిప్‌లో పరుగుల వరద పారిస్తున్నాడు. ఆడిన 7 మ్యాచ్‌ల్లో గ్లామోర్గాన్ తరపున 365 పరుగులు సాధించి, టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన జాబితాలో రెండో స్థానంలో నిలిచాడు. ఇక కెంట్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన కూక్ బౌలింగ్ ఎంచుకున్నాడు. 45 ఓవర్ల ఆట ముగిసేసరికి కెంట్ 7 వికెట్ల నష్టానికి 113 పరుగులు చేసింది. గ్లామోర్గాన్ బౌలర్ మైకెల్ నెసెర్ 4 వికెట్లతో మెరిశాడు.