Saturday, March 21, 2026

మ్యాచ్ ఆడకుండానే వైరల్ అవుతున్న ఉమేష్ యాదవ్.. జట్టు సభ్యులే షాక్

ఐపీఎల్‌ 14వ సీజన్‌లో సీఎస్‌కేపై ఘన విజయం సాధించి మంచి జోష్‌లో కనిపిస్తున్న ఢిల్లీ క్యాపిటల్స్‌ ప్రాక్టీస్‌లోనూ మెరుపులు మెరిపిస్తోంది. అందులోనూ ఆ జట్టు పేసర్ ఉమేశ్ యాదవ్ పట్టిన క్యాచ్ ప్రస్తుతం సెన్సేషన్‌గా మారింది. ఇటీవలే క్వారంటైన్‌ పూర్తి చేసుకొన్న ఉమేశ్ యాదవ్ మంగళవార జరిగిన ప్రాక్టీస్‌ సెషన్‌లో పాల్గొన్నాడు. ఈ క్రమంలోనే రహానే కొట్టిన ఓ బంతిని ముందుకు డైవ్ చేస్తూ ఒంటి చేత్తో అందుకుని ఔరా అనిపించాడు. ఉమేశ్‌ అందుకున్న ఈ స్టన్నింగ్‌ క్యాచ్‌ ఇప్పుడు ఆన్‌లైన్‌లో గెత వైరల్ అవుతోంది.

ఈ ఏడాది ఐపీఎల్ సీజన్‌లో ఉమేశ్.. ఢిల్లీ క్యాపిటల్స్ తరపున ఆడుతున్న విషయం తెలిసిందే. అయితే క్వారంటైన్ నేపథ్యంలో చెన్నైతో జరిగిన తొలి మ్యాచ్‌లో అతడు ఆడలేదు. కానీ తదుపరి మ్యాచ్ కోసం జట్టుతో పాటు ప్రాక్టీస్‌‌లో పాల్గొన్నాడు. ఈ క్రమంలోనే బౌలింగ్ చేస్తూ.. రహానే కొట్టిన ఓ బంతిని అదిరిపోయే డైవ్ చేసి పట్టేశాడు. ఉమేశ్ వేసిన బంతిని ఆఫ్‌సైడ్‌ దిశగా ఆడేందుకు రహానే ప్రయత్నం చేయగా.. బంతి రహానే బ్యాట్‌ ఎడ్జ్‌ తాకి, ఉమేశ్‌‌ ఎడమచేతి వైపు గాల్లోకి లేచింది. అయితే అది తనకు కొంత దూరంలో వెళుతోందని గ్రహించిన ఉమేశ్.. అమాంతం గాల్లోకి ఎగిరి ఆ బంతిని ఒంటిచేత్తో అందుకున్నాడు. ఉమేశ్ పట్టిన ఈ క్యాచ్‌తో రహానేతో పాటు, ఫీల్డింగ్ చేస్తున్న జట్టు సభ్యులు కూడా అతడిని అభినందించారు.


ఈ క్యాచ్‌కు సంబంధించిన వీడియోను ఢిల్లీ క్యాపిటల్స్‌ తన అధికారిక ట్విటర్‌ ఖాతాలో పోస్ట్ చేసింది. దానికి ‘ఉమేశ్‌ ఆన్‌ ఫైర్‌.. స్టన్నింగ్‌ క్యాచ్‌’ అంటూ క్యాప్షన్‌ జత చేసింది. ఈ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. నెటిజన్లు కూడా ఉమేశ్‌ను తెగ అభినందిస్తున్నారు. త్వరగా జట్టులోకొచ్చి సత్తా చాటాలని ప్రోత్సహిస్తున్నారు. కాగా.. సీఎస్‌కేపై విజయంతో జోష్‌లో ఉన్న ఢిల్లీ తన తర్వాతి మ్యాచ్‌లో ఏప్రిల్‌ 15న ముంబై వేదికగా రాజస్తాన్‌ రాయల్స్‌తో తలపడనుంది. తొలి మ్యాచ్‌లో సీఎస్‌కేపై విజయం సాధించిన తీరులోనే ఈ మ్యాచ్‌లో కూడా అదరగొట్టి టోర్నీలో వరుసగా రెండో విజయం నమోదు చేయాలని పట్టుదలగా ఉంది.

Related Articles

Social Share

3,894FansLike
3,576FollowersFollow
3,976FollowersFollow
2,480FollowersFollow
1,267FollowersFollow
7,784SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -