Friday, November 1, 2024

విరాట్ చిన్ననాటి క్రికెట్ కోచ్ మృతి.. ఆవేదనలో కోహ్లీ

ప్రతి వ్యక్తి జీవితంలో ఎంత ఎత్తు ఎదిగినా.. అతడి ఎదుగుదలకు మాత్రం గురువే కారణం. అలా తమను గొప్ప స్థాయికి తీసుకెళ్లిన గురువు దూరమైతే ఆ బాధ శిష్యుడికి తీవ్ర ఆవేదన కలిగిస్తుంది. ఇప్పుడు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా అలాంటి ఆవేదనలోనే ఉన్నాడు. విరాట్‌ కోహ్లీ చిన్నప్పుడు అతడికి క్రికెట్ పాఠాలు చెప్పిన కోచ్‌ సురేశ్‌ బాత్రా శనివారం గుండెపోటుతో మరణించారు. 53 ఏళ్ల సురేశ్‌.. ప్రస్తుతం ఢిల్లీ క్రికెట్‌ అకాడమీలో అసిస్టెంట్‌ కోచ్‌గా వ్యవహరిస్తున్నారు. టీనేజ్‌ వయసులో సురేశ్‌ బాత్రా వద్ద కోహ్లీ బ్యాటింగ్‌ మెళకువలు నేర్చుకున్నాడు. కోహ్లీ బ్యాటింగ్‌ స్టైల్‌లో కీలక మార్పులు రావడానికి కూడా సురేశ్‌‌దే కీలకపాత్ర.

కాగా.. సురేశ్‌ అసిస్టెంట్ కోచ్‌గా పనిచేస్తున్న ఢిల్లీ క్రికెట్‌ అకాడమీలో హెడ్‌ కోచ్‌గా రాజ్‌కుమార్‌ శర్మ పనిచేస్తున్నారు. ఆయనే సురేశ్ మృతి గురించి ఈ మేరకు ట్విటర్‌లో రాజ్‌కుమార్ స్పందించారు. ‘నేను ఈ రోజు నా తమ్ముడిని కోల్పోయాను. సురేశ్‌బాత్రాతో నాకు 1985 నుంచి ప్రత్యేక అనుబంధం ఉంది. ఎందరో క్రికెటర్లను తయారు చేసిన సురేశ్‌ కోహ్లీకి కూడా కోచ్‌గా వ్యవహరించాడు. అతని మృతి మాకు తీరని లోటు’ అంటూ తన ట్వీట్లో పేర్కొన్నారు.

ఇదిలా ఉంటే కోహ్లీ ప్రస్తుతం టీమిండియా కెప్టెన్‌గా ఉన్నాడు. జట్టుకు ఎన్నో విజయాలు అందించాడు. అందిస్తూనే ఉన్నాడు. ఇక తాజాగా డబ్ల్యూటీసీ ఫైనల్‌ ఆడేందుకు జట్టుతో కలిసి జూన్‌ 2న ఇంగ్లండ్‌ బయల్దేరనున్నాడు. అక్కడ కివీస్‌తో టెస్టు చాంపియన్‌షిప్‌ ఫైనల్ మ్యాచ్ ఆడనుంది. ఈ ఫైనల్ ముగిసిన అనంతరం ఆగస్టు నుంచి ఇంగ్లండ్‌తో 5 టెస్టుల సిరీస్‌ ఆడనుంది.

అయితే తన కోచ్ మరణంపై కోహ్లీ నుంచి ఇప్పటివరకు తన కోచ్ మరణంపై ఎలాంటి ప్రకటనా చేయలేదు. సోషల్ మీడియాలో కూడా కోహ్లీ ఎలాంటి పోస్ట్ చేయలేదు. అయితే కోచ్ మరణం గురించి తెలియగానే.. కోహ్లీ ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. కోహ్లీ టీమిండియా కెప్టెన్‌‌గా, ఓ ఆటగాడిగా.. ఈ స్థాయికి చేరడానికి, అతడి బ్యాటింగ్ మెరుగుపడడంలో కూడా సురేశ్ ఎంతో కీలకపాత్ర పోషించారు. అలాంటి గొప్ప వ్యక్తిని కోల్పోవడం నిజంగా కోహ్లీకి కచ్చితంగా ఆవేదన కలిగిస్తుందనడంలో సందేహం లేదు. మరి కోహ్లీ ఎలా స్పందిస్తాడో చూడాల్సి ఉంది.

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments

Related Articles

Social Share

3,894FansLike
3,576FollowersFollow
3,976FollowersFollow
2,480FollowersFollow
1,267FollowersFollow
7,784SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -
0
Would love your thoughts, please comment.x
()
x