Friday, November 1, 2024

రాత్రికి రాత్రే మాయం.. వందల ఏళ్లయినా వీడని మిస్టరీ..?

ఆ ఊరంతా ఒక్కసారిగా మాయమైపోయింది. రాత్రికి రాత్రి ఒక్క పురుగు కూడా లేకుండా ఖాళీ అయిపోయింది. అయితే అదేదో ఈ మధ్య కాలంలో జరిగింది కాదు. ఏకంగా 200ఏళ్ల క్రితం జరిగింది. అవును.. సరిగ్గా 2 శతాబ్దాల క్రితం ఊర్లోని ప్రజలంతా ఒక్క రాత్రిలో కంటికి కనిపించకుండా పోయారు. అయితే వారిని ఏదో దెయ్యం మాయం చేయలేదు. ప్రకృతి కబళించలేదు. వారంతట వారే ఊరిని వదిలి వెళ్లిపోయారు. 1000మందికి అటుఇటుగా ఉన్న ప్రజలు మూడో కంటికి తెలియకుండా వెళ్లిపోయారు. అయితే ఆ వెళ్లిపోయిన వారు ఎటు వెళ్లారు..? ఎక్కడికి వెళ్లి సెటిల్ అయ్యారు. అనే విషయాలు ఇప్పటికీ మిస్టరీనే. ఇంతకీ ఆ ఊరి పేరేంటో తెలుసా..? కుల్‌ధారా.

రాజస్థాన్‌లోని కీలక పట్టణమైన జైసల్మేర్‌కు కేవలం 20 కిలోమీటర్ల దూరంలో ఈ ఊరు ఉంటుంది. ఇక్కడ ఇప్పటికీ ఆ కాలం నాటి ఇళ్లు చెక్కు చెదరకుండా ఉన్నాయి. అప్పటి గోడలు, ఇళ్లు, చిన్న ఆలయం.. అన్నీ అలానే ఉన్నాయి. కానీ మనుషులే కరువయ్యారు.

ఈ ఊరి గురించి అక్కడి ప్రజల్లో ఓ కథ బాగా పాపులర్ అయింది. అదేంటంటే సరిగ్గా 200 ఏళ్ల క్రితం ఈ ప్రాంతాన్ని రాజులు పరిపాలించేవారు. ఆ కాలంలో కుల్‌ధారాలో పలివాల్ బ్రాహ్మణులు నివశించేవారు. జైసల్మేర్ దివాన్‌గా ఉన్న సలీమ్ సింగ్.. ప్రజలపై ఎన్నో అన్యాయాలకు, అక్రమాలకు పాల్పడేవాడు. దుర్మార్గంగా పన్నులు వసూలు చేసేవాడు. అదే సమయంలో అందగత్తె అయిన ఊరి పెద్ద కుమార్తెపై సలీమ్ సింగ్ కన్ను పడింది. ఎలగైనా ఆమెను పొందాలనుకున్నాడు. తన కోరికకు ఎవరైనా అడ్డు వస్తే వారందరిపై దారుణమైన పన్నులు విధిస్తానని హెచ్చరించారు.

దివాన్ బెదిరింపులతో భయపడిన గ్రామస్థులంతా ఓ రోజు రాత్రి ఎవ్వరికీ తెలియకుండా, చడీ చప్పుడు కాకుండా గ్రామాన్ని వదిలి వెళ్లిపోయారు. అప్పటి నుంచి ఈ ఊరు ఇలా ఖాళీగానే ఉంది. ఇక్కడి నుంచి వెళ్లినవారంతా ఎటు వెళ్లారు..? ఎక్కడ ఉంటున్నారు..? అనే విషయం ఎవరికీ తెలియదు. అయితే వారు వెళ్లిపోయే ముందు ఈ ప్రాంతాన్ని శపించిపోయారని స్థానికులు నమ్ముతుంటారు. తాము ఉండలేకపోయిన ఈ ఊరిలో మరెవ్వరూ ప్రశాంతంగా జీవించలేరని వారు శపించినట్లు చెబుతుంటారు.

ఈ భయంతోనే సాయంత్రం కాగానే స్థానికులు ఈ ఊరి తలుపులు మూసేస్తారు. వారి నమ్మకం ప్రకారం ఇప్పటికీ ఈ ప్రాంతంలో అప్పటి ప్రజల ఆత్మలు తిరుగుతుంటాయి. కాగా.. ప్రస్తుతం కుల్‌ధారా గ్రామం ఆర్కియాలజికల్ డిపార్ట్‌మెంట్ ఆధీనంలో ఉంది. దీనిని వారసత్వ సంపదగా సంరక్షిస్తున్నారు అధికారులు.

ఏది ఏమైనా.. ఈ భయానకమైన కథ నిజమో కాదో తెలియదు కానీ.. ఒకప్పుడు సకల సౌకర్యాలతో, నిండుగా ప్రజలతో తులతూగిన ఈ ప్రాంతం ప్రస్తుతం మాత్రం ఖాళీ ఇళ్లు, మొండి గోడలు.. సన్నటి ఇసుక దారులతో నిర్మానుష్యంగా మారింది. నిజంగానే ఘోస్ట్ సిటీలా మారింది.

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments

Related Articles

Social Share

3,894FansLike
3,576FollowersFollow
3,976FollowersFollow
2,480FollowersFollow
1,267FollowersFollow
7,784SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -
0
Would love your thoughts, please comment.x
()
x