ఐపీఎల్ 14వ సీజన్లో భాగంగా ఆదివారం జరిగిన తొలి మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ అద్భుత విజయం సాధించింది. సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను చిత్తుగా ఓడించి సత్తా చాటింది. అయితే మరోవైపు రైజర్స్ దారుణ ప్రదర్శనతో టోర్నీలో మరో ఓటమి మూటగట్టుకుంది. నిన్న, మొన్నటివరకు కెప్టెన్‌గా వ్యవహరించిన డేవిడ్ వార్నర్‌ను కెప్టెన్ పదవి నుంచి తొలగించడమే కాకుండా కనీసం తుది జట్టులో కూడా స్థానం కల్పించలేదు జట్టు యాజమాన్యం. అతడి స్థానంలో కివీస్ ఆటగాడు, ఆ దేశ జాతీయ జట్టు కెప్టెన్ కేన్ విలియమ్సన్‌కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించింది. ఈ మార్పుతో అయినా తమ జట్టు విజయాల బాట పడుతుందని ఫ్రాంచైజీ భావించింది. కానీ ఆ కలలన్నీ కలలుగానే మిగుల్చుతూ రూజర్స్ మరోసారి దారుణ ఓటమిని చవి మూటగట్టుకుంది.
అంటే కెప్టెన్ మారినా సన్‌రైజర్స్ హైదరాబాద్ రాత మాత్రం మారలేదు. ఓపెనర్లు మనీష్ పాండే(31: 20 బంతుల్లో.. 3 ఫోర్లు, 2 సిక్స్‌లు), జానీ బెయిర్ స్టో(30: 21 బంతుల్లో.. 4 ఫోర్లు, 1 సిక్స్) చక్కటి ఓపెనింగ్ అందించినా.. ఆ తర్వాత ఒక్క బ్యాట్స్‌మన్ కూడా కనీస ప్రదర్శన చేయలేదు. తొలిసారి కెప్టెన్‌గా బరిలోకి దిగిన కేన్ విలియమ్సన్(20: 21 బంతుల్లో.. 1 ఫోర్) టెస్ట్ మ్యాచ్‌లా నెమ్మదిగా ఇన్నింగ్స్ ఆడాడు. ఇక మిగిలిన ఆటగాళ్లు కనీస ప్రదర్శన కూడా చేయలేదు. అలా వచ్చి ఇలా వెళ్లిపోయారు. దీంతో ఎస్‌ఆర్‌హెచ్‌కు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి కేవలం 165 పరుగుల మాత్రమే చేయగలిగింది. దీంతో రాజస్థాన్ 55 పరుగుల తేడాతో విజయం దక్కించుకుంది. రాజస్థాన్ బౌలర్లలో ముస్తాఫిజుర్ రెహ్మాన్, క్రిస్ మోరిస్‌లకు చెరో 3 వికెట్లు దక్కగా, రాహుల్ తెవాటియా, కార్తిక్ త్యాగిలు చెరో వికెట్ తీశారు.
కాగా.. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్ దుమ్మురేపింది. ఓపెనర్ జోస్ బట్లర్(124: 64 బంతుల్లో.. 11 ఫోర్లు, 8 సిక్స్‌లలు) ఆకాశమే హద్దుగా చెలరేగి సెంచరీ బాదేశాడు. అతడికి తోడు సంజు శాంసన్(48: 33 బంతుల్లో.. 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) క్రీజులో ఉన్న కాసేపు బౌండరీలతో విరుచుకుపడ్డాడు. వీరిద్దరి దూకుడుతో స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 220 పరుగుల భారీ స్కోరు సాధించింది. తొలి వికెట్ యశస్వి జైస్వాల్(12) వెంటనే అవుటైనా బట్లర్, శాంసన్ జోడీ అదిరిపోయే ఆటతీరుతో అభిమానులను అలరించింది. రైజర్స్ బౌలర్లలో సందీప్ శర్మ, రషీద్ ఖాన్, విజయ్ శంకర్లకు తలా ఓ వికెట్ దక్కింది. ఇక సెంచరీతో చెలరేగిన బట్లర్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది.