ఐపీఎల్‌లో యువ సంచలనం, రాజస్థాన్ రాయల్స్ పేసర్ చేతన్ సకారియా ఇంట వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. గతంలో అతడి సోదరుడు ఆత్మహత్య చేసుకోగా.. తాజాగా తండ్రి కన్జిభాయ్ సకారియా కరోనాతో మరణించారు. కొద్ది రోజులుగా ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ విషయాన్ని రాజస్థాన్ ఫ్రాంచైజీ ట్విటర్ ద్వారా ప్రకటించింది. ఈ కష్టకాలంలో అతడికి అండగా ఉంటామని వెల్లడించింది.
చేతన్ సకారియా ఐపీఎల్ ప్రారంభానికి ముందు సోదరుడిని కోల్పోయాడు. ఇక తాజాగా తండ్రిని కూడా కోల్పోయారు. ఇటీవల చేతన్ సకారియా తండ్రి కంజీ భాయ్‌కి కరోనా సోకింది. ఈ క్రమంలో తీవ్ర అస్వస్థతకు గురైన ఆయన.. గుజరాత్‌లోని భావ్‌నగర్‌లో ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. కాగా.. ఆదివారం పరిస్థితి మరింత విషమించడంతో.. ఆయన తుదిశ్వాశ విడిచారు.
ఈ విషయాన్ని రాజస్థాన్ రాయల్స్ ఫాంచైజీ ట్విట్టర్‌లో వెల్లడించింది. ఈ కష్టకాలంలో తాము చేతన్‌కి అండగా ఉంటామని హామీ ఇచ్చింది. కాగా.. చేతన్ ఐపీఎల్‌లో ఉన్న సమయంలోనే తండ్రి కరోనా బారిన పడ్డారని తెలుసుకున్నాడు. తన ఐపీఎల్ డబ్బులతోనే తండ్రికి మెరుగైన చికిత్స అందించగలుగుతున్నానంటూ ఇటీవలే సకారియా సంతోషం వ్యక్తం చేశాడు. ఇక ఐపీఎల్ రద్దు కావడంతో.. ఇంటికి చేరుకొని తండ్రిని చూసుకుంటున్నాడు. అయితే ఇంతలోనే ఆయన మరణించడం సకారియాకు భారీ దెబ్బ అనే చెప్పాలి.