ఐపీఎల్ 14వ సీజన్లో భాగంగా రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ ఘన విజయం సాధించింది. ముంబై ఓపెనర్ క్వింటర్ డీకాక్
దెబ్బకు రాజస్థాన్ చిత్తయింది. డీకాక్ 50 బంతుల్లోనే 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో అజేయంగా 70 పరుగులు చేసి చివరి వరకు క్రీజులో పాతుకు పోవడంతో
రాజస్థాన్‌కు ఓటమి తప్పలేదు. బౌలర్లను ఓ ఆట ఆడుకుంటూ బౌండరీలతో విరుచుకుపడిన డీకాక్‌ను నిలువరించడం రాజస్థాన్ బౌలర్లకు చేతకాలేదు.
దీంతో 172 పరుగుల లక్ష్యాన్ని ముంబై కేవలం 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఈ విజయంతో ముంబై పాయింట్ల పట్టికలో టాప్ 4లో నిలిచింది. అలాగే
టోర్నీలో మరో ఓటమిని మూటగట్టుకున్న రాజస్థాన్.. అట్టడుగు నుంచి రెండో స్థానానికి పడిపోయింది.
ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ(14) వెంటనే అవుటైనా, ఆ తర్వాత సూర్యకుమార్ యాదవ్(16) కూడా నిరాశపరిచినా, డీకాక్ మాత్రం ఆఖరి వరకు క్రీజులో
పాతుకుపోయి రాజస్థాన్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఎదురు దాడి చేస్తూ జట్టును విజయం వైపు నడిపించాడు. అతడికి కృనాల్ పాండ్యా(39: 26
బంతుల్లో.. 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) మరో ఎండ్‌లో చక్కటి సహకారం అందించాడు. దీంతో ముంబై మరో 9 బంతులు మిగిలుండగానే 7 వికెట్ల తేడాతో
రాజస్థాన్‌ను మట్టి కరిపించింది. రాజస్థాన్ బౌలర్లలో మోరిస్‌కు 2 వికెట్లు, ముస్తాఫిజుర్ రెహ్మాన్‌కు ఓ వికెట్ దక్కాయి. మ్యాచ్ ఆఫ్ ది మ్యాచ్ డీకాక్‌కు
దక్కింది.
అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్.. ఓపెనర్లు జోస్ బట్లర్(41: 32 బంతుల్లో.. 3ఫోర్లు, 3 సిక్స్‌లు), యశశ్వి జైస్వాల్(32: 20
బంతుల్లో.. 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) ధాటిగా ఆడడంతో 8 ఓవర్ల వరకు మంచి స్కోరు సాధించింది. అయితే 8వ ఓవర్లో రాహుల్ చాహర్ బౌలింగ్‌లో బట్లర్
అవుట్ కావడం, 10వ ఓవర్లో జైస్వాల్ కూడా పెవిలియన్ చేరడంతో స్కోరు బోర్డు నెమ్మదించింది. ఆ సమయంలో కెప్టెన్ సంజు శాంసన్(42: 27
బంతుల్లో.. 5 ఫోర్లు) మరో వికెట్ పడకుండా కాపాడుకుంటూనే ధాటిగా ఆడాడు. అతడికి శివమ్ దూబే(35:31 బంతుల్లో.. 2 ఫోర్లు, 2 సిక్స్‌లు)
సహకరించాడు. ఇక చివర్లో రియాన్ పరాగ్ (8), డేవిడ్ మిల్లర్(7) క్రీజులో ఉన్నీరు. దీంతో రాజస్థాన్ 4 వికెట్లకు నిర్ణీత 20 ఓవర్లలో 171 పరుగులు
చేసింది. ముంబై బౌలర్లలో రాహుల్ చాహర్ 2 వికెట్లు పడగొట్టగా, బౌల్ట్, బుమ్రాలకు చెరో వికెట్ దక్కింది.