Wednesday, January 22, 2025

రూ.100 చెల్లిస్తే పన్ను మొత్తం రద్దు.. డెయిరీ, పౌల్ట్రీలకు సర్కార్ గుడ్ న్యూస్

డెయిరీ, పౌల్ట్రీ పన్నుల రైతులకు రాష్ట్ర ప్రభుత్వ తీపికబురందించింది. ఇప్పటివరకు చెల్లించాల్సిన మొత్తం ఆస్తిపన్నును మాఫీ చేసే విధంగా మునిసిపల్‌, పంచాయతీరాజ్‌ శాఖలు
బుధవారం వేర్వేరుగా ఉత్తర్వులు జారీ చేశాయి. రాష్ట్రావతరణ దినోత్సవాన డెయిరీ, పౌల్ట్రీ రైతులకు ప్రభుత్వం ఈ గిఫ్ట్ ఇచ్చినట్లు ఆ ఉత్తర్వుల్లో అధికారులు వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో గ్రేటర్‌ పరిధిలోని డెయిరీ, పౌల్ట్రీ భవనాలకు ఆస్తి పన్ను మినహాయించినట్లు జీహెచ్‌ఎంసీ బుధవారం ప్రకటించింది. ఆయా ఆస్తుల వివరాలను దస్త్రాల్లో కొనసాగించేందుకు వీలుగా ఏడాదికి రూ.100 పన్ను నామమాత్రంగా చెల్లిస్తే సరిపోతుందని అధికారులు తెలిపారు. గ్రామ పంచాయతీల పరిధిలో ఈ పన్నును రద్దు చేస్తూ.. పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ కార్యదర్శి సందీప్‌కుమార్‌ సుల్తానియా నోటిఫికేషన్‌ విడుదల చేశారు.

ఇటీవలే కాగా.. పౌల్ట్రీ ఫెడరేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు ఎర్రబెల్లి ప్రదీప్‌రావు ఆధ్వర్యంలోని ప్రతినిధి బృందం బుధవారం ప్రగతిభవన్‌‌లో సీఎం కేసీఆర్‌తో భేటీ అయ్యారు. అక్కడ తమ బాధలను కేసీఆర్‌కు వివరించారు. దీంతో వారికి పన్ను మాఫీ చేస్తున్నట్లు కేసీఆర్ ప్రకటించారు. ఈ క్రమంలోనే జీహెచ్‌ఎంసీ కూడా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయంతో నగరంలోని వేలాది మంది గేదెల పెంపకందారులు, పాల ఉత్పత్తి కేంద్రాలు, విక్రయ కేంద్రాలు, కోళ్ల పరిశ్రమతో ముడిపడిన కేంద్రాల యజమానులు సంబరపడిపోతున్నారు. ఈ క్రమంలోనే జోన్ల వారీగా డెయిరీ, పౌల్ట్రీల వివరాలను సేకరించేందుకు అధికారులు రెడీ అయ్యారు. అంతేకాకుండా ఈ లబ్ది పొందేందుకు అర్హులైన వారు నేరుగా సంబంధిత సర్కిల్‌ కార్యాలయాల్లోని ఆస్తి పన్ను విభాగాన్ని సంప్రదించాలని సూచించింది. డెయిరీ, పౌల్ట్రీలకు ఆస్తిపన్ను రద్దు నిర్ణయంపై స్పందించిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు.. ఈ నిర్ణయంతో సంబంధిత రైతులకు ఎంతో మేలు జరుగుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు.

ఇదిలా ఉంటే ఆస్తి పన్ను మాఫీతో పాటు విద్యుత్ బిల్లుల్లోనూ డెయిరీ, పౌల్ట్రీలకు కేసీఆర్ సర్కార్ ఓ గొప్ప గిఫ్ట్ ఇచ్చింది. ఇప్పటివరకు పౌల్ట్రీలకు యూనిట్‌కు రూ.6 చొప్పున,
డెయిరీలకు యూనిట్‌కు రూ.4 చొప్పున అందిస్తున్న విద్యుత్‌ను ఇకపై రూ.2 తగ్గించింది. ఈ మేరకు ఆదేశాలు కూడా జారీ చేసింది. దీంతో పౌల్ట్రీలకు యూనిట్‌కు రూ.4, డెయిరీ ఫాంలకు రూ.2 వసూలు చేయనున్నారు. ఈ మేరకు ఇంధన శాఖ కార్యదర్శి సందీప్‌కుమార్‌ సుల్తానియా బుధవారం జీవో జారీ చేశారు.

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments

Related Articles

Social Share

3,894FansLike
3,576FollowersFollow
3,976FollowersFollow
2,480FollowersFollow
1,267FollowersFollow
7,784SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -
0
Would love your thoughts, please comment.x
()
x