Wednesday, January 22, 2025

‘వీడెక్కడి వరుడండీ బాబూ..!’ తప్పతాగిన వరుడు.. అత్త మెడలో వరమాల!

తప్ప తాగి పెళ్లి మంటపానికి వచ్చిన వరుడు.. వధువుకు బదులు ఆమె తల్లి మెడలో వరమాల వేయబోయాడు. వెంటనే అత్త అతడి చేతులను పక్కకు నెట్టేసింది. పక్కనున్న స్నేహితులు కూడా పరిస్థతిని అతడిని గుర్తించి వెనక్కి లాగారు. అనంతరం వధువు మెడలో వరుడి చేత దండ వేయించేందుకు ప్రయత్నించారు. అప్పటికే ఊగుతున్న పెళ్లి కొడుకు దండ వేయకుండానే కింద పడిపోయాడు. పక్కనున్నవారు ప్రమాదాన్ని గ్రహించి పెళ్లికొడుకుని పక్కకు జరిపారు. ఆ తర్వాత వరుడి స్నేహితులు అతడిని పట్టుకుని.. వధువు మెడలో వరమాల వేయించే ప్రయత్నం చేశారు. కానీ మత్తులో మునిగిపోయిన వరుడు.. వధువు మెడలో వరమాల వేయలేకపోయాడు. అంతేకాదు.. స్టేజీ మీదే పడిపోయాడు కూడా.

వరుడు చేసిన బిత్తిరి పనికి వచ్చిన అతిథులంతా షాకయ్యారు. అతగాడి అవతారం చూసి.. పెళ్లినాడే ఇలా ఉంటే.. ఇక జీవితాంతం ఎలా ఉంటాడు అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఆ వరుడు చేసిన ఘనకార్యానికి సంబంధించిన వీడియో తెగ వైరలవుతోంది. ఈ సంఘటన ఎప్పుడు, ఎక్కడ జరిగింది అనే దాని గురించి ఎలాంటి వివరాలు లేవు. కానీ నిరంజన్‌ మహాపాత్ర అనే వ్యక్తి ఈ వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో షేర్‌ చేయడంతో ఇది ఇప్పుడు వైరల్‌గా మారింది. పెళ్లి కొడుకు తీరుపై సోషల్ మీడియాలో విపరీతంగా మీమ్స్, సెటైర్స్ వేస్తూ నెటిజన్లు రెచ్చిపోతున్నారు.

ఫుల్లుగా తాగి ఉండటంతో వరమాల మార్చుకునే సమయంలో.. వధువుకి బదులు ఆమె తల్లి.. అంటే కాబోయే అత్త మెడలో దండ వేయబోతాడు. పక్కనున్న వారు ప్రమాదాన్ని గ్రహించి పెళ్లికొడుకుని పక్కకు జరపుతారు. ఆ తర్వాత వరుడి స్న

Related Articles

Social Share

3,894FansLike
3,576FollowersFollow
3,976FollowersFollow
2,480FollowersFollow
1,267FollowersFollow
7,784SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -