టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, మాజీ కెప్టెన్ గంగూలీని వెనక్కి నెట్టి మరీ అవార్డు అందుకున్నాడు. అయితే ఇదేదో గొప్ప రికార్డని మాత్రం అనుకోకండి. ఎందుకంటే అదో దారుణమైన రికార్డు. అవును అంతర్జాతీయ మ్యాచ్‌లలో అత్యధికసార్లు డకౌట్ అయిన బ్యాట్స్‌మెన్‌గా కోహ్లీ ఓ చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టీ 20లో అత్యంత చెత్త రికార్డును నమోదు చేశాడు. 5 మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన తొలి టీ 20లో ఐదు బంతులాడిన కోహ్లి పరుగులేమీ చేయకుండానే పెవిలియన్ చేరాడు. దీంతో భారత మాజీ కెప్టెన్, ప్రస్తుత బీసీసీఐ చైర్మన్ సౌరవ్ గంగూలీ పేరిట ఉన్న 13 సార్లు డకౌట్ అయిన రికార్డును కోహ్లీ తుడిచశాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధికంగా 14 సార్లు డకౌట్ అయిన టీమిండియా కెప్టెన్‌గా రికార్డు నెలకొల్పాడు.
ఇదిలా ఉంటే ఈ మ్యాచ్‌లో 5 బంతులు ఆడిన కోహ్లీ, అదిల్ రషీద్ బౌలింగ్‌లో భారీ షాట్‌కి ప్రయత్నించి, మిడ్‌ఆన్‌లో క్రిస్ జోర్డాన్ చేతికి క్యాచ్‌గా చిక్కాడు. అయితే గతంలో మహేంద్ర సింగ్ ధోని 11 సార్లు, కపిల్ దేవ్ 10 సార్లు, మహ్మద్ అజారుద్దీన్ 8 సార్లు డకౌట్‌గా వెనుదిరిగారు. టీమిండియాతో ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా అహ్మదాబాద్‌లోని స్టేడియంలో జరిగిన తొలి టీ20లో ఇంగ్లండ్ ఘన విజయం సాధించింది.
టీమిండియా నిర్దేశించిన 125 పరుగుల లక్ష్యాన్ని 8 వికెట్ల తేడాతో చేధించింది. సుందర్ వేసిన 15.3వ బంతిని మలన్ సిక్సర్‌గా మలిచడంతో ఇంగ్లండ్ విజయం ఖాయం అయింది.