Tuesday, May 20, 2025

మహిళా సినీ వర్కర్స్‌కు ‘మనం సైతం’ సాయం

కరోనా కష్టకాలంలో షూటింగ్ లు లేక ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న మహిళా సినీ వర్కర్స్ అక్కా చెల్లెళ్లకు అండగా నిలబడేందుకు ముందుకొచ్చారు “మనం సైతం” కాదంబరి కిరణ్. తన సేవా సంస్థ “మనం సైతం” ద్వారా వారికి నిత్యావసర వస్తువులు అందజేశారు. “తెలుగు సినీ అండ్ టీవీ ప్రొడక్షన్‌ మహిళా వర్కర్స్ యూనియన్” కార్యాలయంలో ఆదివారం మధ్యాహ్నం బియ్యం, ఇతర నిత్యావసర వస్తువులు అందజేశారు. ఈ సందర్భంగా మహిళా వర్కర్స్ కాదంబరి కిరణ్ కు కృతజ్ఞతలు తెలిపారు.

ఈ సందర్భంగా కాదంబరి కిరణ్ మాట్లాడుతూ… మా మహిళా వర్కర్స్ సిస్టర్స్ కు మనం సైతం ద్వారా చేతనైన సాయం అందించడం సంతోషంగా ఉంది. గతేడాది లాగే ఈసారి కూడా కరోనా లాక్ డౌన్ వల్ల మహిళా వర్కర్స్ ఇబ్బందులు పడుతున్నారు. “తెలుగు సినీ అండ్ టీవీ ప్రొడక్షన్‌ మహిళా వర్కర్స్ యూనియన్” సభ్యులకు మనం సైతం నుంచి ఇవాళ నిత్యావసర వస్తువులు పంపిణీ చేశాం. ‘సర్వీస్ ఈజ్ గాడ్ – టర్న్ టు గాడ్ బిఫోర్ రిటర్న్ టు గాడ్’ అనే నినాదంతో ముందుకెళ్తున్నాను. 7సం.లుగా వేలకొద్దీ కార్యక్రమాలు మనం సైతం ద్వారా నిర్వహించాం. వాటిలో నాటి కేరళ వరదలు, తిత్లి తూఫాన్, హైదరాబాద్ ముంపు బాధితులు ..ఇలా అవసరార్థుల కోసం నా పరుగు సాగుతూనే ఉంది. మధ్యలో వచ్చిన కోవిద్ టెక్ష్ట్స్ కోవిద్ పేషెంట్స్ కొరకు భోజనాలతో పాటు మాస్క్ లు సానటైజెర్, మందులు, పేస్ షీల్డ్స్, ఆక్సిమేటర్స్, ఆక్సిజెన్ సిలెండర్లు, ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్, అంబులెన్సులు, ఆస్పత్రి లో బెడ్లు, ఇతర సౌకర్యాలు, ఆసుపత్రి బిల్లుల తగ్గింపునకు సిఫారసులు.. ఒకటేమిటి అందినంత సాయం వరకు అన్నీ అందించాము. నాకీ సాయం చేసే బలం ఇచ్చిన దేవుడికి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. పేదవారికి చేతనైన సాయం కోసం ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరికైనా మనం సైతం సిద్ధం అన్నారు.

మహిళా వర్కర్స్ మాట్లాడుతూ…సినిమా వాళ్ల కష్టాలు సినిమా వాళ్లకే తెలుస్తాయి. ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో పనులు లేక చాలా ఇబ్బందులు పడుతున్నాం. మేము సాయం అడిగిన వాళ్లు చేయని సందర్భాలు ఉన్నాయి. కానీ మేము అడక్కుండానే వచ్చి మాకు సహాయం చేస్తున్నారు “మనం సైతం” కాదంబరి కిరణ్ గారు. ఇవాళ మా యూనియన్ సభ్యులకు నిత్యావసర వస్తువులు అందజేశారు. మాలో మానసిక స్థైర్యాన్ని నింపారు. గతేడాది కూడా కరోనా టైమ్ లో ఇలాగే మా యూనిట్ మహిళలందరికీ నిత్యావసర వస్తువులు ఇచ్చారు. “మనం సైతం” ద్వారా ఆయన వేల మందికి సేవ చేస్తున్నారు. మాలో అనారోగ్యంతో బాధపడిన ఎన్నో కుటుంబాలకు ఆర్థిక సాయం అందించారు. ఆయన మేలు మేము ఎప్పటికీ మర్చిపోము. అన్నారు.

ఈ కార్యక్రమంలో లలిత, సీసీ శ్రీను, రమేష్ రాజా, క్రేన్ నారాయణ తదితరులు పాల్గొన్నారు.

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments

Related Articles

Social Share

3,894FansLike
3,576FollowersFollow
3,976FollowersFollow
2,480FollowersFollow
1,267FollowersFollow
7,784SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -
0
Would love your thoughts, please comment.x
()
x