Wednesday, January 22, 2025

సోనూసూద్ రేమిడెసివిర్ ఎలా ఇస్తున్నాడో విచారించండి: హై కోర్ట్

ముంబై: రెమిడెసివిర్ ఇంజక్షన్లు కలిగి ఉండడంపై సోనూసూద్, జీషన్ సిద్ధిఖీలపై క్రిమినల్ ఫిర్యాదులు దాఖలయ్యాయని వెల్లడించింది. సిద్ధిఖీ బీడీఆర్ ఫౌండేషన్ ద్వారా రెమిడెసివిర్ ఇంజెక్షన్లు వితరణ చేశారని, ఇక సోనూసూద్ లైఫ్ లైన్ మెడికేర్ ఆసుపత్రిలోని దుకాణాల ద్వారా రెమిడెసివిర్ పొందారని అడ్వొకేట్ జనరల్ అశుతోష్ కుంభకోణి కోర్టుకు వివరించారు. సిద్ధిఖీ తన వద్దకు వచ్చిన వారికి నేరుగా రెమిడెసివిర్ ఇంజెక్షన్లు ఇవ్వకుండా వారిని బీడీఆర్ ఫౌండేషన్ కు మళ్లించారని, ఈ విషయంలోనే ఆయనపై ఫిర్యాదు వచ్చినా కేసు నమోదు కాలేదని తెలిపారు. ట్రస్టుకు సంబంధించిన వారిపై కేసులు నమోదైనట్టు వివరించారు.

దీనిపై బాంబే హైకోర్టు స్పందిస్తూ.. వీళ్లిద్దరూ తమను తాము దైవదూతలుగా భావిస్తూ, కనీసం ఆ ఔషధాల పంపిణీ చట్టబద్ధమో, కాదో తెలుసుకోకుండా వ్యవహరించారని ఆగ్రహించింది. దీనిపై పూర్తి వివరాలతో అఫిడవిట్ సమర్పించాలని మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ‘ప్రభుత్వం మీకోసం ఏమీ చేయలేకపోతోంది, కానీ మీకోసం మేం చేస్తున్నాం అంటూ వీరు వ్యవహరిస్తున్నారు. రేపు వీళ్ల తరహాలోనే మరొకరు వస్తారు’ అంటూ కోర్టు ఆందోళన వ్యక్తం చేసింది.

అలాగే సోనూసూద్ పంపిణీ చేసిన రెమిడెసివిర్ ఇంజెక్షన్లు భివాండీలోని సిప్లా ఫార్మా సంస్థ నుంచి వచ్చాయని, ఇవి ప్రభుత్వ కేటాయింపుల్లోనివి కావని, దీనిపై విచారణ పెండింగ్ లో ఉందని సోను సూద్ తరపు న్యాయవాది పేర్కొన్నారు.

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments

Related Articles

Social Share

3,894FansLike
3,576FollowersFollow
3,976FollowersFollow
2,480FollowersFollow
1,267FollowersFollow
7,784SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -
0
Would love your thoughts, please comment.x
()
x