రంగుల చెక్కల గోడలు, అందమైన బాల్కనీ. అదిరిపోయే ఇంటీరియర్ డిసైన్. అన్నింటికీ మించి ఎక్కడికి కావాలంటే అక్కడికి తీసుకుపోయే సౌకర్యం.. ఇవన్నీ ఓ ఇంటి స్పెషల్ ఫీచర్స్. ఇలాంటి ఫీచర్స్ ఉన్న ఇల్లు చూడగానే ఎవరికైనా నచ్చేస్తుంది. అంతే కాదు ఈ ఇంటిని ఎక్కడికైనా, ఎప్పుడైనా తీసుకెళ్లిపోవచ్చు. అవునండి ఇదో మొబైల్ ఇల్లు. ఈ ఫొటోలో కనిపిస్తున్న రంగు రంగుల ఇల్లే ఆ మొబైల్ హౌస్. ఈ ఇల్లు పునాది తీసి ఇటుకతో గోడలు, ఇనుముతో పైకప్పు కాంక్రీట్‌తో కట్టలేదు. ఇనుము, చెక్కతో రెడీమెడ్‌గా 12+36 అడుగుల పరిమాణంలో అన్ని వసతులతో ఈ ఇంటిని నిర్మించారు.
వినుకొండ శివారులోని బ్రాహ్మణపల్లె వద్ద ఓ స్థిరాస్తి వ్యాపారి తన కార్యాలయం కోసం తన లేఅవుట్‌లో ఇలా ఏర్పాటు చేశారు. చుట్టూ నాలుగు కమ్మీలపైన ఇనుముతో ఈ ఇంటిని కట్టారు. వేడిని తగ్గించేందుకు లోపల భాగంలో చెక్క ఈ రెండింటి మధ్య మందపాటి ఫోమ్ అమర్చారు. వరండా, హాల్, లోపల అటాచ్డ్ బాత్‌రూంతో కలిపి బెడ్‌రూం ఏర్పాటు చేశారు. ఆ బెడ్ రూమ్ లో ఏసీ సెట్ చేశారు. హైదరాబాద్‌కు చెందిన కార్మికులు 15 రోజుల్లో దీన్ని నిర్మించగా.. మొత్తం ఖర్చు రూ.8.50 లక్షలు అయినట్లు యజమాని తెలిపారు.
అయితే దీనిని నిర్మించిన తర్వాత సదరు వ్యాపారి మరో వ్యాపారికి దాన్ని విక్రయించేశాడు. అలా కొనుక్కున్న రెండో వ్యక్తి.. ఆ ఇంటిని అక్కడి నుంచి మరో చోటికి తేవాయుకెళ్తున్నాడు. క్రేన్‌తో పొడవాటి ట్రాలీలో ఎక్కించి తరలిస్తున్నాడు. మరి మీక్కూడా ఇలాంటి ఇల్లు కావలనిపిస్తోంది కదూ..!