ఓయూ జేఏసీ విద్యార్థి సురేష్ యాదవ్‌ను బీజేపీ నేత బండి సంజయ్ పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఎన్నో బలిదానాలతో స్వేచ్ఛ కోసం తెగించి కొట్లాడిన గడ్డ ఉస్మానియా యూనివర్సిటీ అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ప్రధాన భూమిక పోషించిన విద్యార్థులపై రాక్షస సీఎం డైరెక్షన్‌లో టీఆర్ఎస్ పార్టీ గూండాలు దాడులు చేస్తున్నారని బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘కేసీఆర్‌పై దాడులు చేసే రోజు వస్తుంది. కేసీఆర్ నీ పతనం మొదలైంది’’ అని వ్యాఖ్యానించారు.
ధనిక రాష్ట్రం తెలంగాణను అప్పులపాలు చేశారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మండిపడ్డారు. బీజేపీకి భయపడి గడీల నుంచి బయటకు వస్తున్నారని చెప్పారు. కేసీఆర్ రాష్ట్రాభివృద్ధికి రూపాయి కేటాయించలేదన్నారు. ప్రతి స్కీంకు కేంద్రం ప్రభుత్వమే నిధులు ఇస్తోందని చెప్పారు. గడీల పాలన అంతం కావాలంటే బీజేపీకి పట్టంగట్టాలన్నారు.
మరోవైపు మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల కూడా కేసీఆర్ పై నిప్పులు చెరిగాడు. తాను ప్రజల ప్రేమను నమ్ముకుని ముందుకు వెళుతున్నానాని, కేసీఆర్ కుట్రలను నమ్ముకున్నాడని ఈటల ఆగ్రహం వ్యక్తం చేశారు. తెనేపూసిన కత్తిని కడుపులో పెట్టుకుని కుట్రలు చేస్తే హుజూరాబాద్ ప్రజలు సహించరని ఈటల నిపౌలు చెరిగారు. ‘కోట్లు ఖర్చు చేసి ఎమ్మెల్సీ స్థానాలు గెలవవచ్చు. కోట్లు కుమ్మరించి హుజూర్ నగర్, నాగార్జున సాగర్ గెలవచ్చు. కానీ హుజూరాబాద్‌లో ఆ కుట్రలు సాగవు బిడ్డా’ అంటూ కేసీఆర్ పై ఈటల ఫైర్ అయ్యారు.