Wednesday, January 22, 2025

ఈ పాము ధర రూ.15 లక్షలు.. అమ్మబోతుండగా..

పాములకు అతీంద్రీయ శక్తులు ఉంటాయని అనేకమంది నమ్ముతారు. అయితే అది ఇప్పటికీ ప్రూఫ్ కాలేదు. అయినప్పటికీ కొన్ని పాములకు మానవాతీత సక్తులున్నాయని, వాటి ద్వారా అపారమైన సంపద లభిస్తుందని అనేకమంది మూఢ నమ్మకం. ఈ మూఢ నమ్మకం కారణంగా ఓ పాము ధర ఏకంగా లక్షల రూపాయలు పలుకుతోంది.

వివరాల్లోకి బెలితే.. ఆ పాముకు శక్తులు ఉన్నాయని నమ్ముతారు.. అది ఎవరి దగ్గర ఉంటే వారు ధనవంతులవుతారని, వారి శత్రువులు, రహస్యంగా ఉన్న నిధిని అది కనుగొంటుందని కూడా నమ్ముతారు. మొత్తానికి ఆ పామును కలిగి ఉన్న వాళ్లను గొప్ప అదృష్టవంతులుగా భావిస్తారు.. ఆ పాము పేరు శాండ్ బోవా. దీనినే మండుల్ అనే పేరుతో కూడా పిలుస్తారు.

ఇదిలా ఉంటే.. ఆ పామును అమ్మబోతున్నాడనే కారణంతో పుణెకు సమీపంలోని పంప్రి చించివాడ్‌కు చెందిన 21 ఏళ్ల యువకుడిని అటవీ అధికారులు తాజాగా అరెస్ట్ చేశారు. పక్కా సమాచారంతో ఆ యువకుడి ఇంటి మీద దాడి చేసిన అధికారులు అతడి అధీనంలో ఉన్న పామును స్వాధీనం చేసుకున్నారు. యువకుడిని వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్-1972 చట్టం ప్రకారం అరెస్ట్ చేశారు. అతను ఎవరికి ఆ పామును అమ్మాలనుకున్నాడో విచారిస్తున్నారు. విష రహితమైన ఆ పాము ఖరీదు దాదాపు 15 లక్షలు ఉంటుందని అంచనా వేస్తున్నారు.

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments

Related Articles

Social Share

3,894FansLike
3,576FollowersFollow
3,976FollowersFollow
2,480FollowersFollow
1,267FollowersFollow
7,784SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -
0
Would love your thoughts, please comment.x
()
x