జమ్మూ కశ్మిర్ వేదికగా ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో అఖిలపక్ష సమావేశం జరిగిన విషయం తెలిసిందే. జమ్మూ-కశ్మీరు భవిష్యత్తుపై చర్చించేందుకు గురువారం మోడీ ఈ సమావేశం నిర్వహించారు.
ఈ పార్టీకి అన్ని పార్టీల ప్రధాన నాయకులు హాజరయ్యారు. అయితే మోదీ నిర్వహించిన అఖిలపక్ష సమావేశం గురించి తనకు తెలియదని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ చెప్పారు.
ఇటీవల ఓ న్యూస్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన మమత.. జమ్మూ-కశ్మీరుకు రాష్ట్ర హోదాను తొలగించడానికి కారణమేమిటో తనకు తెలియదన్నారు.
జమ్మూ-కశ్మీరుపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నిర్వహించిన అఖిలపక్ష సమావేశం గురించి కూడా తనకు తెలియదని చెప్పుకొచ్చారు.
‘అధికరణ 370ని రద్దు చేయడం వల్ల భారత దేశానికి కళంకం వచ్చింది.. కేంద్రం చర్య వల్ల దేశ ప్రతిష్ఠ ప్రపంచవ్యాప్తంగా మసకబారింది.
అదేంటని బీజేపీని ప్రశ్నిస్తే వాళ్ళు జాతి వ్యతిరేకులవుతున్నారు’ అని మమత మండిపడ్డారు.
అనంతరం రైతులు నిర్వహిస్తున్న నిరసన కార్యక్రమాలను ప్రస్తావించారు. సాగు చట్టాలను రద్దు చేయాలని రైతులు డిమాండ్ చేయడం సరైనదేనని అన్నారు.
కాగా.. ఈ సమావేశంలో జమ్మూ-కశ్మీరుకు చెందిన 14 మంది ప్రముఖ నేతలు పాల్గొన్నారు.
మోదీ అధికారిక నివాసంలో జరిగిన ఈ సమావేశంలో హోం మంత్రి అమిత్ షా, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, జమ్మూ-కశ్మీరు మాజీ ముఖ్యమంత్రులు ఫరూఖ్ అబ్దుల్లా, ఒమర్ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీ, గులాంనబీ ఆజాద్ హాజరయ్యారు