శ్రీలంక పర్యటనకు శిఖర్ ధవన్ సారథ్యంలోని టీమిండియా రెండో జట్టు మరికొద్ది రోజుల్లో ఆ దేశం చేరుకోనుంది. అక్కడ ఇరు జట్లూ 3 వన్డేలు, 3 టీ20ల్లో పోటీ పడతాయి. విరాట్ కోహ్లీ సారథ్యంలోని టీమిండియా ప్రధాన జట్టు ఇంగ్లండ్ పర్యటనలో ఉండంతో ఈ రెండో జట్టును శ్రీలంక పర్యటనకు భారత క్రికెట్ బోర్డు ఎంపిక చేసింది. అయితే తాజాగా ఈ టోర్నీపై శ్రీలంక లెజెండరీ ఆటగాడు, 1996 ప్రపంచకప్ గెలిచిన జట్టు కెప్టెన్ అర్జున రణతుంగ నిప్పులు చెరిగారు.
టీమిండియా బీ జట్టుతో టోర్నీకి అంగీకరించి దేశ ప్రతిష్ఠను సర్వనాశనం చేశారని శ్రీలంక క్రికెట్ బోర్డుపై రణతుంగ ఆగ్రహం వ్యక్తం చేశాడు. శ్రీలంక క్రీడామంత్రి నమల్ రాజపక్స, శ్రీలంక క్రికెట్ బోర్డుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. టీవీ హక్కుల కోసమే శ్రీలంక బోర్డు భారత బి జట్టుతో ఆడేందుకు అంగీకరించిందని ఆరోపించాడు. సొమ్ము చేసుకోవడానికి బోర్డు దీనికి ఒప్పుకుందని విమర్శించారు.
‘శ్రీలంక పర్యటనకు వచ్చిన భారత జట్టు అత్యుత్తమమైనదేమీ కాదు. అది ద్వితీయస్థాయి జట్టు. మన క్రీడామంత్రికో, క్రికెట్ నిర్వాహకులకో ఈ విషయం తెలియదా?’ అని రణతుంగ ప్రశ్నించాడు. ర్యాంకుల పరంగా శ్రీలంక జట్టు దిగజారిపోయి ఉండొచ్చని, కానీ క్రికెట్ ఆడే దేశంగా శ్రీలంకకు ఓ గుర్తింపు, గౌరవం ఉందని చెప్పిన రణతుంగ.. ఇండియా-బీ జట్టుతో తలపడేందుకు దేశ అత్యుత్తమ జట్టును పంపొద్దని కోరాడు.
ఇదిలా ఉంటే రణతుంగ వ్యాఖ్యలపై శ్రీలంక క్రికెట్ ఘాటుగా స్పందించింది. ప్రస్తుతం తమ దేశంలో పర్యటిస్తున్న భారత జట్టు సెకండ్ టీం కాదని, అన్ని విభాగాల్లో ఎంతో పటిష్టంగా ఉందని స్పష్టం చేసింది. ఈ మేరకు శ్రీలంక క్రికెట్ శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేసింది. ‘‘కొంతమంది మీడియాలో తమ ఇష్టారీతిన మాట్లాడుతున్నారు. వారందరికీ ఇదే సమాధానం. శ్రీలంక టూర్‌కు వచ్చిన టీమిండియా పరిమిత ఓవర్ల జట్టు ఎంతో పటిష్టమైనది.
భారత బృందంలోని ప్రస్తుత 20 మందిలో 14 మంది సభ్యులు ఇప్పటికే టీమిండియా తరఫున ఏదో ఒక ఫార్మాట్‌లో, మరికొందరు అన్ని ఫార్మాట్ల(టెస్టు, వన్డే, టీ20)లోనూ ప్రాతినిథ్యం వహించి ఉన్నారు. ఇది ద్వితీయ శ్రేణి జట్టుకాదు’’ అని పరోక్షంగా అర్జున రణతుంగకు కౌంటర్ ఇచ్చింది.
అదే విధంగా… ఒకేసారి కోహ్లి, ధావన్ సారథ్యంలోని భారత జట్టు రెండు వేర్వేరు దేశాల్లో పర్యటించడంపై స్పందిస్తూ… ‘‘క్రికెట్ ప్రపంచంలో ఇదొక సరికొత్త విధానం. ముఖ్యంగా ఐసీసీ సభ్య దేశాలు… తమ అవసరాలకు అనుగుణంగా ఒక్కో ఫార్మాట్‌కు ప్రత్యేక స్వ్యాడ్‌తో ఆడించే అవకాశం ఉంటుంది.