మీరు జియో సిమ్ వాడుతున్నారా..? డేటా బ్యాలెన్స్ అయిపోయిందా..? అయితే ఫ్రీ 1 జీబీ డేటా పొందండి. ఈ మేరకు జియో ఓ సరికొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. అదే డేటా లోన్. వినియోగదారులు తమ రోజువారీ డేటా కోటాను పూర్తిగా వినియోగించిన తరువాత ఇక వారికి హైస్పీడ్ డేటా ఉండదు. దీంతో రోజంతా ఇబ్బందులు పడుతున్నారు. దీంతో ప్రతి వినియోగదారుడు వెంటనే 1 జీబీ డేటాను టాపప్ చేసుకునేలా కొత్త ప్లాన్‌ను జియో అమల్లోకి తెచ్చింది. ఈ టాపప్ డేటాకి సంబంధించిన రీఛార్జ్ ఎమౌంట్‌ని తర్వాత చెల్లించుకోవచ్చు.
సాధారణంగా జియో డేటా ఆడ్ ఆన్ ప్లాన్స్‌లో 1 జీబీ డేటా ధర రూ.11గా ఉంది. ఇదే ధరలో ఇప్పుడు లభిస్తున్న డేటా లోన్‌ను కూడా జియో అందించనుంది. ఈ సౌకర్యం ప్రీపెయిడ్ వినియోగదారులకు జియో అందిస్తోంది. అంటే ఇప్పటివరకు ప్రీ పెయిడ్‌గా డేటా ఆడ్ ఆన్ ప్యాక్ తీసుకున్న యూజర్లు ఇకపై డేటా యాక్టివేట్ చేసుకున్న తరువాత డబ్బులు చెల్లించవచ్చన్నమాట.
ఎలా పొందాలంటే:
మై జియో యాప్‌లో మెనూలోకి వెళ్లాలి. అందులో మొబైల్ విభాగాన్ని ఎంపిక చేసుకుంటే అక్కడ ఎమర్జెన్సీ డేటా లోన్ ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయగానే మొదట యాక్టివేట్ నౌ ఆ తర్వాత ప్రోసీడ్ అనే ఆప్షన్లు వస్తాయి. ఈ ప్రాసెస్ ఫాలో అయితే 1 జీబీ డేటా అప్పటికప్పుడు లభిస్తుంది. మొత్తం ఐదు సార్లు ఇలా డేటా లోన్ తీసుకోవచ్చు.