Wednesday, January 22, 2025

రామోజీ ఫిల్మ్ సిటీ లొ షూటింగ్ జరుపుకుంటున్న ‘‘విద్య వాసుల అహం’’

రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్ హీరో హీరోయిన్లుగా ఎటర్నిటి ఎంటర్ టైన్ మెంట్ ప్రొడక్షన్ నెంబర్ 2 గా తెరకెక్కబోతోన్న సినిమా ‘విద్య వాసుల అహం’(వివాహం). ‘తెల్లవారితే గురువారం’ సినిమా తర్వాత మణికాంత్ గెల్లి ఈ మూవీని డైరెక్ట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన ఫస్ట్‌లుక్ మరియు టైటిల్, యానిమేషన్ కాన్సెప్ట్ వీడియో అద్భుతమైన స్పందనను రాబట్టుకున్న విషయం తెలిసిందే. సినిమా కూడా అద్భుతంగా వస్తున్నట్లుగా దర్శకుడు మణికాంత్ గెల్లి తెలిపారు.

ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ.. ‘‘పెళ్ళైన ఒక జంట మధ్య ఉన్న ఇగోలతో ఈ సినిమా కథాంశం ఉంటుంది. ప్రతి సన్నివేశం ఎంటర్‌టైనింగా ఉంటూ.. ప్రేక్షకులని హాయిగా నవ్వించడమే కాకుండా ఆలోచింపజేసేలా ఈ సినిమా ఉంటుంది. ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో కీలక పార్ట్ షూటింగ్‌ను జరుపుతున్నాము. శరవేగంగా షూటింగ్ పూర్తి చేసి.. త్వరలోనే చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తాము.’అన్నారు.

చిత్ర నిర్మాతలు లక్ష్మి నవ్య మోటూరు, రంజిత్ కుమార్ కొడాలి మాట్లాడుతూ ” మా చిత్రానికి కల్యాణి మాలిక్‌గారు స్వరాలను సమకూరుస్తున్నారు. దసరా పర్వదినాన్ని పురస్కరించుకొని 5వ తేదీన మ సినిమా గ్లిమ్స్ ను రిలీజ్ చేయనునాం. సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలోనే తెలియజేస్తాము’’ అని తెలిపారు.

నటీనటులు:
రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments

Related Articles

Social Share

3,894FansLike
3,576FollowersFollow
3,976FollowersFollow
2,480FollowersFollow
1,267FollowersFollow
7,784SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -
0
Would love your thoughts, please comment.x
()
x