మాఊరి పొలిమేర చిత్రానికి సీక్వెల్‌గా రూపొందిన చిత్రం “మా ఊరి పొలిమేర 2” డా.అనిల్ విశ్వనాథ్. దర్శకుడు. సత్యం రాజేష్, కామాక్షి భాస్కర్ల ముఖ్యతారలుగా నటించిన ఈ చిత్రం ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. గౌరికృష్ణ నిర్మించిన ఈ చిత్రాన్ని ప్రముఖ పంపిణీదారుడు వంశీ నందిపాటి ప్రపంచవ్యాప్తంగా విడుదల చేశారు. విడుదలైన రోజు నుంచి ప్రేక్షకాదరణతో బ్లాక్‌బస్టర్ విజయం దిశగా చిత్రం కొనసాగుతుంది. ఈ చిత్రం రెండో వారంలోకి ప్రవేశించిన సందర్భంగా చిత్ర యూనిట్ శుక్రవారం గ్రాండ్ బ్లాక్‌బస్టర్ మీట్‌ను ఏర్పాటు చేసింది.
ఈ గ్రాండ్ సక్సెస్ మీట్ కు అతిథిగా విచ్చేసిన సాయి రాజేష్ మాట్లాడుతూ.. నాకు హారర్, థ్రిల్లర్, క్రైమ్ జానర్‌లంటే వాటి వసూళ్ల పరిథి తక్కువగా వుంటుందనే అంచనా వుండేది. వంశీ నందిపాటి ఈ సినిమా హక్కులు తీసుకున్నప్పుడు ఎందుకు తీసుకున్నాడు నీకు పిచ్చి పట్టిందా? అన్నాను. కానీ వంశీ మాత్రం
తన కాన్పిడెన్స్‌తో సినిమాను విడుదల చేశాడు. కానీ ఈ సినిమా ఫలితం చూసిన తరువాత నా అంచనాలు తప్పు అని తెలుసుకున్నాను. ఈ సినిమా నాకు జడ్జిమెంట్ విషయంలో కనువిప్పు కలిగింది. ఈ సినిమాకు కథే కింగ్. ఈ సినిమా విజయం సాధించడం చాలా హ్యపీగా వుంది. నాకు తెలిసి రాబోయే పోలిమేర 3 కూడా బ్లాక్‌బస్టర్ కొడుతుంది. ఎటువంటి సందేహం లేదు అన్నారు.
హీరో శ్రీ విష్ణు మాట్లాడుతూ.. ఈ సినిమాలో యాక్ట్ చేసిన అందరూ నాకు ఎప్పట్నుంచో తెలుసు. సత్యం రాజేష్ నేను హీరో అవుతానని నమ్మిన వ్యక్తి. ఆయన మాటలు నాకు తెలిసిన ఇంత మంది మిత్రులకు హిట్ ఇచ్చిన దర్శకుడికి థాంక్స్. సినిమాల్లో చిన్న సినిమా పెద్ద సినిమా అనే తేడా వుండదు. సినిమా విడుదల తరువాత అది చిన్న సినిమానా.. పెద్ద సినిమానా అనేది ఆడియన్స్ డిసైడ్ చేస్తారు. పోలిమేర 2 అనేది చాలా పెద్ద సినిమా. కొన్ని సినిమాలు బాగున్నా థియేటర్స్‌లో ఆడవు. కానీ ఈ సినిమా వరల్డ్‌కప్ జరగుతున్న సమయంలో ఇంత మంచి కలెక్షన్స్‌తో విజయవంతంగా ఆడటం గొప్ప విషయం. తప్పకుండా ఈ సినిమా అందరూ చూడాల్సిన సినిమా.
నిర్మాత గౌరి క్రిష్ణ మాట్లాడుతూ ఈ సినిమా విజయానికి కారణం దర్శకుడు అనిల్ విశ్వనాథ్ ప్రతిభ. కొంతకాలం నుండి నాకు సరైన సక్సెస్ రాలేదు. పొలిమేర 1 చూసి దర్శకుడు అనిల్‌ను కలిసి ఈ సినిమాను నిర్మించాను. నాకు సరైన సమయంలో మంచి విజయం వరించింది. ఈ సినిమా ఈ రోజు ఇంత విజయం వరించడానికి కారకుల్లో వంశీ నందిపాటి ఒకరు. ఆయన ఈ సినిమాను గ్రాండ్‌గా విడుదల చేశాడు. సినిమా కోసం నటీనటులు, సాంకేతిక నిపుణులు ఎంతో కష్టపడ్డారు. ఇలాంటి విజయాలు ఈ సినిమాకు పనిచేసిన అందరూ మరన్నో అందుకోవాలని ఆశిస్తున్నాను అన్నారు.
దర్శకుడు అనిల్ విశ్వనాథ్ మాట్లాడుతూ ఈ సినిమా జర్నిలో ఎన్నో అనుకోని పరిస్థితులు ఎదురయ్యాయి. కాని నాకు నేనే ధైర్యం తెచ్చుకుని జర్నీ కొనసాగించాను. ఈ సినిమా విజయం తరువాత నా లైఫ్ ఇక నుంచి వేరేలా వుంటుంది. ఈ సినిమా విజయం సమిష్టికషిలా భావిస్తున్నాను. అన్నారు.
వంశీ నందిపాటి మాట్లాడుతూ సక్సెస్ అంటే సెల్ఫ్ శాటిస్‌ఫాక్షన్..మనం నమ్మిది నిజం అయితే ఆ హ్యపీనెస్ వేరు. ఈసినిమా విషయంలో అదే జరిగింది. సక్సెస్‌తో శాటిస్‌ఫాక్షన్ కూడా ఇచ్చిన సినిమా ఇది. మా టీమ్ ఎంతో మంది కష్టపడి ఈ విజయం సాధించారు. పొలిమేర ఫ్రాంఛైజీ కూడా కంటిన్యూ అవుతుంది అన్నారు.
కామాక్షి భాస్కర మాట్లాడుతూ ఈ సినిమా విజయం సమిష్టి కష్టం. ఇది అంతా మా టీమ్ అంతా నమ్ముతున్నాం. ఈ సినిమా విజయానికి కారణమైన అందరికి నా థ్యాంక్స్ అన్నారు. సత్యం రాజేష్ మట్లాడుతూ నా నిర్మాత గౌరిక్రిష్ణ సినిమాను నిలబెట్టడమే నా ముందున్న లక్ష్యం. నిర్మాత ఎంతో కష్టపడి సినిమా చేశారు. అప్పుడు వంశీ నందిపాటి ఎంట్రీతో ఈసినిమా పెద్ద సినిమాగా మారింది. వీరిద్దరు ఈ సినిమాకు రెండు కళ్లు లాంటి వారు. దర్శకుడు అనిల్ ప్రతిభ గురించి ఎంత చెప్పిన తక్కువే. ఈ రోజు సినిమా విజయం సాధించడం ఎంతో ఆనందంగా వుంది అన్నారు. ఈ సమావేశంలో రమేష్, ఖుషేందర్, గ్యానీ, చిత్రం శ్రీను, రవివర్మ, బాలాదిత్య, రాకేందు మౌళి, గెటప్ శ్రీను తదితరులు పాల్గొన్నారు.