Friday, November 1, 2024

‘ఆకాశ వీధుల్లో’ ట్రైలర్ విడుద‌ల

గౌతమ్‌ కృష్ణ, పూజితా పొన్నాడ జంటగా నటించిన చిత్రం ‘ఆకాశ వీధుల్లో’. గౌతమ్‌ కృష్ణ దర్శకుడిగా పరిచయం అవుతోన్న ఈ చిత్రాన్ని మనోజ్‌ జేడీ, డా. డీజే మణికంఠ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలోని ‘శిలగా ఇలా నేనే మిగిలానుగా.. జతగా నువ్వు లేని ఏకాకిగా..’ అనే పాటల‌ను ఇటీవ‌లే విడుదల చేశారు. ఈ పాటకు చైతన్య ప్రసాద్‌ లిరిక్స్‌ అందించగా, సింగర్‌ కాల భైరవ పాడారు. జూడా శాండీ ఈ సినిమాకు మ్యూజిక్‌ డైరెక్టర్‌. చైతన్య ప్రసాద్, శ్రేష్ట, రాకేందు మౌళి ఈ సినిమా పాటలకు సాహిత్యాన్ని అందించారు. కాగా, మంగ‌ళ‌వారం నాడు ఈ సినిమా ట్రైల‌ర్ విడుద‌లైంది.

అనంత‌రం సంగీత ద‌ర్శ‌కుడు జూడా శాండీ మాట్లాడుతూ… నా అస‌లుపేరు రాజేష్ రాధాకృష్ణ‌న్‌. గౌత‌మ్ కృష్ణ‌. నాకు అవ‌కాశం ఇచ్చి ప్రోత్స‌హించారు. అంద‌రికీ న‌చ్చే సినిమా. చిత్ర టీమ్‌ కు శుభాకాంక్ష‌లు తెలిపారు.

చిత్ర నిర్మాత మ‌నోజ్ మాట్లాడుతూ… సెప్టెంట‌ర్ 2న మా సినిమా విడుద‌ల‌కాబోతుంది. అంద‌రూ ఆద‌రించండి. మా అబ్బాయే హీరోగా చేశాడని తెలిపారు.

క‌థా ర‌చ‌యిత‌, హీరో, ద‌ర్శ‌కుడు అయిన గౌత‌మ్ కృష్ణ మాట్లాడుతూ… మాది కొత్త టీమ్‌. మొద‌టి సినిమా. ఎం.బి.బి.ఎస్‌. పూర్తిచేసి సినిమాపై త‌ప‌న‌తో ఈ సినిమా తీశాను. ఈ సినిమాను ఎందుకుచూడాల‌నేవారికి చెప్పేది ఒక్క‌టే. ఈ సినిమా ఒక హీరో మీద‌నో కేరెక్ట‌ర్ మీద‌నే తీసిందికాదు. యంగ్‌స్ట‌ర్స్ అంద‌రి క‌థ‌. ఎదిగి న‌త‌ర్వాత వ‌య‌స్సువ‌చ్చిన‌వారికి చెందిన‌ క‌థ కూడా. మ‌న‌లో మ‌న‌కు జ‌రిగే సంఘ‌ర్ష‌ణ ఇందులో చ‌క్క‌గా చూపించాం. ట్రైల‌ర్‌ లో డ్రెగ్స్‌, ఆల్క‌హాలు అంశాలున్నాయి. వీటిపై ప‌లువురు కామెంట్లు చేశారు. ర‌చ‌యిత‌గా, ద‌ర్శ‌కుడిగా సినిమాను ఎలా చూపించాలో నాకు తెలుసు. అందుకే సినిమా మొత్తం చూసి మీరు స్పందిచండి. ఇది అన్ని వ‌య‌స్సుల‌వారికి న‌చ్చే సినిమా. ఈ సినిమా ప్ర‌తి ఒక్క‌రినీ ఆలోచించేలా చేస్తుంద‌ని చెప్ప‌గ‌ల‌ను. ఇందులో రెండు షేడ్స్ వున్న పాత్రను పోషించాను. మాతోపాటు 40 మంది మీముందుకు వ‌స్తున్నాం. మీ ఆశీర్వాదం కావాలి. ఇందులో న‌టీన‌టులు, సాంకేతిక సిబ్బంది కూడా వున్నాం. కుటుంబంలోని పిల్ల‌ల ఆలోచ‌న‌లు ఎలా వుంటాయి అనేది పెద్ద‌లు గ్ర‌హించేట్లుగా చూపించాం. త్వరలో ప్రీ రిలీజ్ వేడుక వుంది. అప్పుడు మ‌రిన్ని వివ‌రాలు తెలియ‌జేస్తాను. క‌మ‌ర్షియ‌ల్ అంశాలున్న సినిమా అని చెప్పారు.

ట్రైల‌ర్‌ ప‌రంగా చెప్పాలంటే, సామాన్యుడు రాక్ స్టార్ ఎలా అయ్యాడు? అత‌ని జీవితంలో ప్రేమ పాత్ర ఎంత‌వ‌రకు వుంది. అనేది చూపించారు.

అనంత‌రం విలేకరుల ప్ర‌శ్న‌ల‌కు గౌత‌మ్ కృష్ణ స‌మాధాన‌మిస్తూ, నేను డాక్ట‌ర్ అయినా, చిన్న‌ప్ప‌టినుంచి న‌ట‌న అంతే ఇష్టం. మా కుటుంబంలో అంద‌రూ ఎడ్య‌కేట్ ప‌ర్స‌న్స్‌. నా ఇంట్రెస్ట్ చూసిన నాన్న‌గారు డాక్ట‌ర్ పూర్త‌య్యాక న‌ట‌న‌వైపు ర‌మ్మ‌న్నారు. అలాగే చేశాను. నాకు ఎడిటింగ్‌ పైనా ప‌ట్టువుంది. న‌ట‌న‌లో మ‌హేష్ ద‌గ్గ‌ర శిక్ష‌ణ తీసుకున్నాను. న‌న్ను నేను నిరూపించుకునేందుకు చేసిన ప్ర‌య‌త్న‌మిది.

ట్రైల‌ర్‌ చూశాక‌ అర్జున్ రెడ్డి షేడ్స్ క‌నిపించాయ‌ని అనుకుంటున్నారు. ఇందులో డ్రెగ్ అనే విష‌యం కొన్ని నిముషాల‌పాటే ఉంటుంది. ప్ర‌ధాన‌మైన పాయింట్ టీనేజ్ అబ్బాయి రాక్‌స్టార్ ఎలా అయ్యాడు. అన్న‌ది క‌థే. స్క్రిప్ట్ బేస్డ్ సినిమా.

నాకు మొద‌టి నుంచి ద‌ర్శ‌క‌త్వం బాగా చేయ‌గ‌ల‌న‌నే న‌మ్మ‌కం వుంది. కానీ న‌టుడిగా కొంత భ‌య‌ముండేది. అందుకే న‌న్ను నేను ప‌రీక్షించుకోవాల‌ని యాక్టింగ్ స్కూల్‌లో జాయిన్ అయి., ఈ పాత్ర‌పై క‌స‌ర‌త్తు చేశాను.

నా రియ‌ల్ లైఫ్‌ కు ఈ పాత్ర‌కు సంబంధంలేదు. డాక్ట‌ర్‌ చ‌దివేట‌ప్పుడు చాలామందిని ప‌రిశీలించాను. అన్నీ వున్న‌వారు కూడా ఏదో తెలీని బాధ కొంత‌మందిలో గ్ర‌హించాను. అందుకే వారిని ప‌రిశీలించి చేసిన సినిమా ఇది. పిల్ల‌తో త‌ల్లిదండ్రులు ఫ్రెండ్‌లా వుండాలని చెప్పేదే మా సినిమా. అని అన్నారు.

న‌టుడు అక్ష‌య్ మాట్లాడుతూ… థియేట‌ర్ ఆర్టిస్టుని. అంద‌రం చాలా క‌ష్ట‌ప‌డి ప‌నిచేశాం. మ‌మ్మ‌ల్ని ఎంక‌రేజ్ చేయండ‌ని పేర్కొన్నారు.

మ‌రో న‌టుడు ఆనంద్ మాట్లాడుతూ… సెప్టెంబ‌ర్ 2న విడుద‌లువుంది. గౌత‌మ్ ట్రైల‌ర్‌ ను చాలా ప్రామిసింగ్‌ గా చూపించాడు. బ్యూటిఫుల్ ల‌వ్‌స్టోరీ విత్‌ స్ట్ర‌గుల్ ఇందులో క‌నిపిస్తుంది అన్నారు. మ‌రో న‌టుడు విశు ఆచార్య మాట్లాడుతూ,బబ్లూ అనే పాత్ర‌లో న‌టించానన్నారు.

ర‌చ‌యిత ప‌ర‌శురామ్ మాట్లాడుతూ… అశ్వ‌థ్థామ చిత్రానికి మాట‌లు రాశాను. మ‌రికొన్ని సినిమాల‌కు ప‌నిచేశాను. గౌత‌మ్ సూప‌ర్ టాలెంటెడ్.. ఐదేళ్ళ జ‌ర్నీలో చాలా గ్ర‌హించాను. ఈ సినిమాకు ఉడ‌తాభ‌క్తిగా ద‌ర్శ‌కుడికి సాయం చేశాను. గౌత‌మ్ టీం త‌ప‌న ఇందులో క‌నిపిస్తుంది. అన్ని క్రాఫ్ట్‌లు ప‌నిచేయ‌డం గౌత‌మ్ కే సాధ్య‌మ‌యింది అని తెలిపారు.

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments

Related Articles

Social Share

3,894FansLike
3,576FollowersFollow
3,976FollowersFollow
2,480FollowersFollow
1,267FollowersFollow
7,784SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -
0
Would love your thoughts, please comment.x
()
x