Sunday, March 22, 2026

జాతీయ సినీ పురస్కార విజేతలకు అభినందనలు: పవన్ కల్యాణ్

68వ జాతీయస్థాయి చలన చిత్ర పురస్కార విజేతలకు హృదయపూర్వక అభినందనలు. ఈ దఫా పురస్కారాల్లో ఎక్కువ శాతం దక్షిణ భారత చిత్రసీమ నుంచి వచ్చిన చిత్రాలు దక్కించుకోవడం సంతోషించదగ్గ పరిణామం. తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి ఉత్తమ సంగీత దర్శకుడిగా శ్రీ ఎస్.ఎస్.తమన్ (అల వైకుంఠపురం), ఉత్తమ కొరియోగ్రఫీ శ్రీమతి సంధ్యా రాజు (నాట్యం), ఉత్తమ మేకప్ ఆర్టిస్ట్ శ్రీ టి.వి.రాంబాబు (నాట్యం), ఉత్తమ తెలుగు చిత్రంగా ‘కలర్ ఫోటో’ పురస్కారాలు కైవశం చేసుకొన్నందుకు ఆనందంగా ఉంది. వీరందరికీ నా అభినందనలు. ఈ స్ఫూర్తితో వీరి నుంచి మరిన్ని మంచి చిత్రాలు రావాలని ఆకాంక్షిస్తున్నాను.

(పవన్ కళ్యాణ్)

Related Articles

Social Share

3,894FansLike
3,576FollowersFollow
3,976FollowersFollow
2,480FollowersFollow
1,267FollowersFollow
7,784SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -