సింహా ప్రధాన పాత్రలో హాల్సియాన్ మూవీస్, ఎంఎఫ్ఎఫ్ ముద్రాస్ ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్స్ పై ప్రొడక్షన్ నెం 1 గా జెవి మధు కిరణ్ దర్శకత్వంలో నూతన చిత్రం ‘రావణ కళ్యాణం’ పూజా కార్యక్రమాలతో గ్రాండ్ గా ప్రారంభమైయింది. సత్యదేవ్ కెమెరా స్విచ్ ఆన్ చేయగా, సింహా తనయుడు అర్జున్ సింహా క్లాప్ ఇవ్వగా, వివి వినాయక్ తొలి సన్నివేశానికి గౌరవ దర్శకత్వం వహించారు.
పాన్ ఇండియా మూవీగా తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ భాషల్లో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని అరుణ్ కుమార్ సూరపనేని, కె. రేష్మి సింహా నిర్మిస్తున్నారు. ఆలూరి సురేష్, సింహా సమర్పకులు. సందీప్ మాధవ్, రాజేంద్ర ప్రసాద్, దీపికా, శత్రు, మధునందన్, కీలక పాత్రలు పోషిస్తున్నారు.
అనంతరం సింహా మాట్లాడుతూ.. ‘రావణ కళ్యాణం’ చాలా ఆసక్తికరమైన కథ. వంగవీటి, జార్జ్ రెడ్డి చిత్రాల్లో అద్భుతంగా ఫెర్ ఫార్మ్ చేసిన శాండీ ఈ చిత్రంలో భాగం కావడం మరింత ఉత్సాహాన్ని ఇస్తుంది. రధన్ సంగీతం ఈ చిత్రానికి మరో పెద్ద అసెట్. అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చాడు. జాతిరత్నాలు చిత్రంలో సిద్దం మనోహర్ విజువల్స్ నాకు చాలా ఇష్టం. ఈ కథకు ఆయన విజువల్స్ అద్భుతంగా ఉండబోతున్నాయి. శరత్ రవి, శత్రు, రాజేంద్ర ప్రసాద్ లాంటి అనుభవం గల నటులు కీలక పాత్రలు పోహిస్తున్నారు. కథ విన్నప్పుడు ఎంత ఎక్సయిట్ అయ్యానో, ఈ సినిమా చుస్తునప్పుడు ప్రేక్షకులు కూడా అంతే ఎక్సయిట్ అవుతారు’’ అన్నారు.
దర్శకుడు మాట్లాడుతూ.. ‘రావణ కళ్యాణం’ పాన్ ఇండియా స్థాయిలో చేయబోతున్నాం. తెలుగు, తమిళ్. హిందీ, కన్నడలో ఒకేసారి విడుదల చేయబోతున్నాం’’ అన్నారు.
ఈ చిత్రానికి సిద్దం మనోహర్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, రధన్ సంగీతం సమకూరుస్తున్నారు. భవానీ ప్రసాద్ డైలాగ్స్ అందిస్తున్న ఈ చిత్రానికి శ్రీకాంత్ పట్నాయక్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు.
తారాగణం : సింహా, సందీప్ మాధవ్, రాజేంద్ర ప్రసాద్, దీపికా, రీతు గాయత్రి (పరిచయం), శత్ర, రాజ్‌కుమార్ కాసి రెడ్డి, మధునందన్, గుండు సుదర్శన్, అనంత్ తదితరులు