కడుపు నొప్పితో ఓ వ్యక్తి ఆసుపత్రికొచ్చాడు. అతడికి పరీక్షలు చేసిన డాక్టర్లకు దిమ్మతిరిగింది. ఎందుకంటే అతడి కడుపులో ఏకంగా 59 అడుగుల పొడవున్న ఓ పురుగును గుర్తించాడు. డాక్టర్లు దానిని బయటకు తీసి ఫోటోలు షేర్ చేయడంతో ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. డాక్టర్లు వెల్లడించిన వివరాల ప్రకారం.. స్థానిక నాంగ్ ఖాయ్ ప్రావిన్స్‌లోని ఓ ఆసుపత్రికి ఓ 67 ఏళ్ల ఓ వృద్ధుడు కడుపు నొప్పి, ఆపానవాయువు(ఫార్టింగ్) సమస్యతో చాలా కాలంగా బాధపడుతున్నాడు. అయితే చాలా కాలంగా ఈ సమస్య బాధపెడుతుండడం, ఇటీవల బాధ ఎక్కువ కావడంతో ఆసుపత్రికి వెళ్లాడు. వైద్యులు అతడి పరిస్థితి తెలుసుకుని పరీక్షలకు పంపించారు. అతడి మలాన్ని సేకరించి పరీక్షించారు. ఆ పరీక్షల్లో అతడు టేప్ వర్మ్ సమస్యతో బాధపడుతున్నట్లు తెలుసుకున్నాడు. దీంతో డాక్టర్లు అతడికి నులిపురుగులను నాశనం చేసే ఔషధాలను అతడికి వేయడంతో మలద్వారం నుంచి టేప్ వర్మ్ బయటకొచ్చింది.
అలా వచ్చిన పురుగును డాక్టర్లు బయటకు లాగడం మొదలుపెట్టారు. ఏదో కొంత పొడవు ఉంటుందని అనుకున్న డాక్టర్లకు దిమ్మతిరిగినంతపనైంది. లాగే కొద్దీ అంతం లేకుండా బయటకు వచ్చి ఏకంగా 18 మీటర్ల పొడవుంది. దీనిని చూసిన డాక్టర్లంతా షాకయ్యారు. చివరకు 18 మీటర్లు(59 అడుగులు) పొడవున్న టేప్ వర్మ్‌ను బయటకుతీశారు.
బయటకు తీసిన తరువాత ఆ పురుగును ఓ ఎర్రటి వస్త్రంపై ఉంచి డాక్టర్లు దాని ఫోటోలను తీశారు. వాటిని సోషల్ మీడియాలో షేర్ చేయడంతో దీనిపై ఆసుపత్రిలోని పారాసైటిక్ డిసీజ్ రీసెర్చ్ సెంటర్ సిబ్బంది మాట్లాడుతూ.. అతడి మలాన్ని పరీక్షించడంతో అందులో దాదాపు 28 గుడ్లను సైతం గుర్తించారు. దీంతో అతడి కడుపులో టేప్ వర్మ్ ఉన్నట్లు గుర్తించామని చెప్పారు. అయితే ఇంత పెద్ద పురుగు ఉంటుందని అనుకోలేదని, ముక్కలు ముక్కులుగా ఆ పురుగును బయటకు తీయడంతో మొత్తం 18 మీటర్లు ఉన్నట్లు గుర్తించామని వెల్లడించారు. దీనిపై పేషెంట్ మాట్లాడుతూ.. తనకు ఈ సమస్య నుంచి విముక్తి కలిగించినందుకు డాక్టర్లు ధన్యవాదాలు చెప్పాడు.