Wednesday, January 22, 2025

కోహ్లీ-రోహిత్.. మధ్యలో బాబర్.. ఈ లెక్కేంటంటే..!

ఇప్పటికే టెస్ట్, టీ20 సిరీస్‌లను ఖాతాలో వేసుకున్న టీమిండియా.. తాజాగా వన్డే సిరీస్‌ను విజయంతో మొదలు పెట్టింది. ఈ క్రమంలోనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ తాజాగా వన్డే ర్యాంకింగ్స్‌ను వెల్లడించింది. అందులో బ్యాట్స్‌మెన్ ర్యాంకింగ్స్‌లో కీలక మార్పులు సంభవించాయి. ఈ క్రమంలోనే ఐసీసీ తాజా వన్డే ర్యాంకింగ్స్‌ను ప్రకటించింది. అందులో టీమిండియా 117 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది. కాగా.. ఇంగ్లండ్ జట్టు 123 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది. కాగా ఆటగాళ్ల ర్యాకింగ్స్‌లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ 868 పాయింట్లతో టాప్ ర్యాంకులో ఉన్నాడు. అయితే ఈ ర్యాంకుల్లో ముఖ్యంగా రోహిత్ శర్మ దెబ్బతిన్నాడు. మొన్నటివరకు టాప్ 2లో ఉన్న రోహిత్ ఇప్పుడు మూడో ర్యాంకుకు పడిపోయాడు. అతడి స్థానాన్ని పాక్ బ్యాట్స్‌మన్, వన్డే కెప్టెన్ బాబర్ అజాం కైవసం చేసుకున్నాడు. అలాగే ఇండియాతో వన్డే సిరీస్‌లో అదరగొడుతున్న ఇంగ్లండ్ టాపార్డర్ బ్యాట్స్‌మన్ జానీ బెయిర్ స్టో ఓ స్థానం మెరుగుపర్చుకుని ఏడో స్థానానికి చేరాడు.

కాగా కివీస్ సీనియర్ బ్యాట్స్‌మన్ రాస్ టేలర్ 810 పాయింట్లతో టాప్ 4లో ఉండగా.. ఐదో స్థానంలో ఆస్ట్రేలియా ఓపెనర్ ఆరోన్ ఫించ్ 791 పాయింట్లతో ఉన్నాడు. ఆ తరువాత సౌతాఫ్రికా బ్యాట్స్‌మన్ ఫాఫ్ డూ ప్లెసిస్ 790 పాయింట్లతో ఆరో స్థానంలో, ఆసిస్ డాషింగ్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ 773 పాయింట్లతో 8వ స్థానంలో ఉన్నారు. 9వ స్థానంలో 773 పాయింట్లతో విండీస్ ఓపెనర్ షాయ్ హోప్, పదో స్థానంలో 757 పాయింట్లతో కివీస్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ ఉన్నారు.

ఇదిలా ఉంటే ఇంగ్లండ్‌తో జరిగిన తొలి వన్డేలో టీమిండియా ఘన విజయం సాధించింది. బ్యాటింగ్, బౌలింగ్ అన్ని విభాగాల్లో ఇంగ్లీష్ జట్టుకు మట్టి కరిపించి వన్డే సిరీస్‌లో బోణీ కొట్టింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియాకు చక్కటి ఆరంభం లభించింది. రోహిత్(28), ధనవ్(98) కలిసి వికెట్ పడకుండా నెమ్మదిగా ఆడారు. అయితే 10 ఓవర్లు దాటిన తరువాత రోహిత్ అవుటైనా.. ధవన్ క్రీజులో పాతుకుపోయాడు. అతడికి కోహ్లీ(56) తోడవడంతో స్కోరు బోర్డు వేగం పెరిగింది. అయితే అర్థ సెంచరీ తరువాత కోహ్లీ అవుట్ కావడం, ఆ వెంటనే శ్రేయాస్ అయ్యర్(6) కూడా అవుట్ కావడంతో స్కోరు బోర్డు మందగించింది. కేఎల్ రాహుల్‌(62)తో కలిసి ఇన్నింగ్స్ చక్కదిద్దేందుకు ప్రయత్నించిన ధవన్.. సెంచరీకి 2 పరుగుల దూరంలో అవుటైనా.. ఆ తరువాత క్రీజులోకొచ్చిన కృనాల్ పాండ్యా రాహుల్ అండతో చెలరేగి ఆడాడు. అరంగ్రేట్ర మ్యాచ్‌లోనే అతి తక్కువ బంతుల్లో అర్థ సెంచరీ చేసి రికార్డు సృష్టించారు. దీంతో టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్లకు 317 పరుగులు చేసింది.

అనంతరం 318 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లీష్ జట్టుకు అదిరిపోయే ఆరంభం లభించింది. జేసన్ రాయ్(46), జానీ బెయిర్ స్టో(94) ఆకాశమే హద్దుగా చెలరేగారు. దీంతో టార్గెట్ ఛేజ్ చేయడానికి మొత్తం 50 ఓవర్లు కూడా ఇంగ్లండ్‌కు అవసరం లేదేమో అనిపించింది. అయితే వీరి జోడీని అరంగేట్ర బౌలర్ ప్రసిద్ధ్ కృష్ణ విడదీశాడు. రాయ్‌ను తన తొలి వికెట్‌గా తన ఖాతాలో వేసుకున్నప్రసిద్ధ్ కృష్ణ.. వెంటనే బెన్ స్టోక్స్(1) వికెట్ కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. ఆ తర్వాత మిగతా ఆటగాళ్లు కూడా వెంటవెంటనే అవుట్ కావడంతో ఇంగ్లండ్ ఓటమి చవిచూసింది. 42.1 ఓవర్లలో 251 పరుగులకే ఆలౌట్ అయిపోయింది. దీంతో సిరీస్‌లో తొలి విజయాన్ని టీమిండియా గెలుపొందింది. దీంతో టీమిండియా వన్డే సిరీస్‌ను 1-0తో ఆధిక్యం సాధించింది.

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments

Related Articles

Social Share

3,894FansLike
3,576FollowersFollow
3,976FollowersFollow
2,480FollowersFollow
1,267FollowersFollow
7,784SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -
0
Would love your thoughts, please comment.x
()
x