పక్షులు, జంతువుల వంటి మూగ జీవాలకు అనేకమంది ఆహారం అందిస్తుంటారు. వేసవిలో చాలా మంది పక్షులకు నీరు, ఆహారం అందిస్తుంటారు. కానీ, కొందరు మాత్రం వెరైటీగా పక్షులకు ఆహారం అందించబోయి దెబ్బయిపోతుంటారు. మూగజీవాలకు ఆశ చూపి.. ఆడుకోవాలని అనుకుంటారు. తాజాగా ఓ వ్యక్తి ఇలాంటి విచిత్రమైన పనితోనే పక్షులను ఆశపెట్టబోయాడు. కానీ ఆ పక్షులకు కోపం రావడంతో అతడి ప్లాన్ అంతా రివర్సైంది. చివరికి ముఖం మొత్తం చెడగొట్టుకుని ఇంటికి పయనమయ్యాడు. ఇంతకీ అతనేం చేశాడు..? పక్షి ఇచ్చిన పనిష్మెంట్ ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
సముద్రం ఒడ్డున ఓ వ్యక్తి పక్షులకు ఆహారం వేసే ప్రయత్నం చేశాడు. అందరిలా కాకుండా కొత్తగా ట్రై చెయ్యబోయాడు. ఆ వ్యక్తి చిన్న ఆహార పదార్థాన్ని తన నోటితో పట్టుకుని పక్షులను ఆహ్వానించాడు. అయితే అతడి ముఖం నచ్చలేదో, అతడు చేస్తున్న పని నచ్చలేదో అక్కడ తిరుగుతున్న పక్షుల్లో ఓ పక్షి అతడి ముఖంపై చారెడు రెట్ట వేసి వెళ్లిపోయింది. దీంతో తన ప్రయత్నం బెడిసికొట్టడంతో పాటు ముఖం పాడైపోవడంతో తెగ బాధపడిపోయాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ తంతునంతా వీడియో తీసిన మరో వ్యక్తి దానిని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా తెగ వైరల్ అవుతోంది.
Feeding the seagulls… pic.twitter.com/EsVWjGfxCU
— Rex Chapman🏇🏼 (@RexChapman) April 5, 2021
కడుపుబ్బా నవ్విస్తున్న ఈ వీడియోపై నెటిజన్లు ఫన్నీగా రియాక్ట్ అవుతున్నారు. సదరు వ్యక్తికి తిక్క కుదిరిదంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ వీడియోను ఇప్పటి వరకు 50 లక్షల మందికిపైగా నెటిజన్లు చూశారు. వారిలో అనేకమంది రకరకాల ఫన్నీ కామెంట్లు కూడా చేశారు.