ఇటీవల ఇంగ్లండ్‌తో జరిగిన తొలి వన్డేలో శ్రేయస్ అయ్యర్ ఎడమ చేతికి తీవ్ర గాయమైన విషయం తెలిసిందే. గాయం కారణంగా ఇంగ్లండ్ వన్డే సిరీస్‌తో పాటు ఐపీఎల్ 2021 సీజన్ మొత్తానికి దూరమయ్యాడు. ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న అయ్యర్.. లీగ్ మొత్తానికి దూరం కావడంతో ఢిల్లీ ఫ్రాంచైజీ ఆందోళన చెందింది. దీంతో అతని స్థానంలో టీమిండియా యువ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ రిషబ్ పంత్‌కు ఢిల్లీ ఫ్రాంచైజీ కెప్టెన్‌గా ఎంపిక చేసింది.
ఆసీస్ ఒకప్పటి కెప్టెన్ స్టీవ్ స్మిత్, టీమిండియాకు కెప్టెన్‌గా వ్యవహరించిన ఆజింక్య రహానే వంటి సీనియర్లున్నప్పటికీ పంత్‌కు కెప్టెన్సీ పగ్గాలు అప్పటించడానికే ఢిల్లీ ఫ్రాంచైజీ మొగ్గు చూపింది. ఈ ఎంపికను ఆ జట్టు కోచ్ రికీ పాంటింగ్ కూడా సమర్థించాడు. టీమిండియా మాజీలు కూడా పంత్ కెప్టెన్సీ నిర్వహించగలని అభిప్రాయపడ్డారు. మరి వీరి నమ్మకాన్ని పంత్ ఏ స్థాయిలో నిలబెడతాడో చూడాలి.
కాగా.. తాజాగా తన గాయానికి డాక్టర్లు సర్జరీ చేశారని, సర్జరీ విజయవంతంగా పూర్తియిందని అయ్యర్ తన ట్విటర్‌లో పేర్కొన్నాడు. భుజానికి నిర్వహించిన శస్త్రచికిత్స విజయవంతమైందని, త్వరలోనే తిరిగి మైదానంలో అడుగుపెడతానని ఆ పోస్ట్‌లో పేర్కొన్నాడు. సర్జరీ అనంతరం హాస్పిటల్ బెడ్‌పై కూర్చుని ఉన్న ఫొటోను షేర్ చేసి.. దానికి
‘సర్జరీ సక్సెస్.. ధృడసంకల్పంతో అతి త్వరలోనే తిరిగి వచ్చేస్తాను. మీ అందరి విషెస్‌కు కృతజ్ఞతలు’ అని రాసుకొచ్చాడు.