Sunday, March 22, 2026

సూపర్ మార్కెట్‌లో సడెన్ గెస్ట్.. జనాలంతా షాక్.. బయటకు పరుగులు

సాధారణంగానే ఉన్నట్లుండి గొడపై ఏ బల్లో, పురుగో కనిపిస్తేనే మనం ఉలిక్కి పడతాం. అలాంటిది ఒక్కసారిగా మన దగ్గరికి దాదాపు మనిషంత పొడవున్న ఓ రాకాసి బల్లి వస్తే.. పరిస్థితేంటి..? గొంతెండిపోతుంది, గుండె గొంతులోకొస్తుంది. అయితే మనకేమో కానీ థాయ్‌ల్యాండ్‌లో మాత్రం అలాంటి సంఘటనే ఒకటి చోటు చేసుకుంది. సూపర్ మార్కెట్లో అంతా బిజీబిజీగా ఉన్న సమయంలో ఎక్కడి నుంచి దూరిందో ఓ కొమోడో డ్రాగన్ లోపలికి ప్రవేశించింది. దీంతో షాపు యజమానితో సహా, అక్కడ పనిచేసేవారు, అక్కడికొచ్చిన కష్టమర్లు అంతా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బయటకు పరుగులు తీశారు.

సూపర్ మార్కెట్లోకి వచ్చిన ఆ రాకాసి బల్లి చక్కగా.. అసలైన కస్టమర్‌లా స్టోర్‌ అంతా కలియ తిరిగింది. షేల్ఫ్‌లో ఏదో కొనడానికి వచ్చినట్లు.. అంతా ఓ రౌండ్ వేసింది. షెల్ఫ్‌లు ఎక్కి అటు ఇటు తిరుగుతూ అక్కడి వస్తువులన్నీ కింద పడేసింది. అయితే అది లోపల అంత రచ్చ చేస్తున్నా దానిని ఆపే సాహసం మాత్రం ఎవరూ చేయలేకపోయారు. చివరికి వైల్డ్ లైఫ్ అధికారులకు సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి దానిని తీసుకెళ్లారు.

కాగా.. దీనికి సంబంధించిన వీడియోను ఆండ్రూ మాక్‌గ్రెగర్‌ అనే జర్నలిస్ట్‌ ట్వీటర్‌‌లో షేర్ చేశాడు. దీంతో ప్రస్తుతం ఈ వీడియో ఆన్‌లైన్‌లో తెగ హల్ చల్ చేస్తోంది. దీన్ని చూసిన నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ఓ నెటిజన్ ‘వామ్మో.. ఎంత భయంకరంగా ఉంది’ అని కామెంట్ చేయగా.. మరో నెటిజన్ ‘మీరేనా షాపింగ్‌ చేసేది.. పాపం దానిక్కుడా చేయాలనిపించిందేమో..’ అని ఫన్నీగా కామెంట్‌ చేశాడు.

Related Articles

Social Share

3,894FansLike
3,576FollowersFollow
3,976FollowersFollow
2,480FollowersFollow
1,267FollowersFollow
7,784SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -