మీకు పాత నోట్లు సేకరించే అలవాటు ఉందా..? అయితే మీరు అదృష్టవంతులే. ఇప్పుడు పాత నోట్లకు డిమాండ్ బాగా పెరిగిపోయింది. చాలా ఆన్ లైన్ వెబ్ సైట్లు పాత, లగ్జరీ నోట్లను విక్రయిస్తున్నాయి. నోట్లను సేకరించడానికి ఇష్టపడే వ్యక్తులు వీటిని చాలా ఖరీదైన ధరలకు కొనుగోలు చేస్తున్నారు. ఒకవేళ మీదగ్గరా పాతనోట్లు ఉంటే మీరు మిలియన్లు చెల్లించేందుకు రెడీగా ఉన్నారు. ఆ లెక్కేంటో ఇప్పుడు చూద్దాం.
అనేక వెబ్‌సైట్లు లగ్జరీ నంబర్ నోట్లను విక్రయిస్తాయి. ఇందులో 888888 లేదా 123456 వంటి క్రమ సంఖ్యలతో ఉండవచ్చు. అంతేకాకుండా నిర్ధిష్ట గవర్నర్ సంతకాన్ని బట్టి ఆ నోటు విలువను పెంచుకోవచ్చు. కొందరు స్వాతంత్రానికి ముందు ఉన్న నోట్లు, నాణేలు కొనడానికి ఇష్టపడతారు. ఒక నోటుపై లక్కీ నంబర్ ఉంటే.. కొనుగోలుచేసేవారు ఎక్కువగా చెల్లిస్తారు. అలాగే కొంతమంది పుట్టిన రోజు ఉంటే ఎక్కువ ధరకు కొంటారు.
కొన్ని రోజుల క్రితం గవర్నర్ బీసీ రామ్ రావు చిహ్నం ఉన్న పాత రూ.100 నోటును కాయిన్‌బజార్ అనే వెబ్‌సైట్‌లో రూ .16,000 కు అమ్మారు. అలాగే 1957 లో గవర్నర్ హెచ్.ఎం. పటేల్ సంతకం చేసిన ఒక రూపాయి నోట్ల కట్ట రూ.45,000 కు అమ్ముడైంది. ఈ నోట్ల నెంబర్ 123456. అలాగే గవర్నర్ ఎస్. వెంకటరమణ సంతకం చేసిన రూ.500 నోట్ల కట్ట రూ .1.55 లక్షలకు అమ్ముడైంది. ఈ నోట్ల సంఖ్య 1616 నుండి మొదలవుతుంది.
ఒకవేళ మీ వద్ద పాత రూపాయి నోటు ఉంటే ఆన్‌లైన్‌లో మీ అదృష్టాన్ని పరీక్షించుకోండి. దానికోసం ఈబే వంటి ఆన్ లైన్ ఫ్లాట్ఫామ్ ను ఎంచుకోండి.